కాంచన 3: వామ్మో.. మళ్లీ అదే కథా!


కాంచన 3: వామ్మో.. మళ్లీ అదే కథా!

కాంచన 3: అదే కథ!

దక్షిణాది సినిమాలోనే తొలి హారర్ కామెడీ ఫ్రాంచైజీ ‘ముని’ని సృష్టించాడు రాఘవ లారెన్స్. అందులో భాగంగా ఇప్పటికి మూడు సినిమాలు వచ్చాయి. అన్నింటిలోనూ దాదాపు ఒకే కథ. హీరో లారెన్స్‌ను ఒక దెయ్యం ఆవహించడం, అతనితో విలన్లను చంపించడం.

ఇప్పుడు ఆ సిరీస్‌లో నాలుగో సినిమా ‘కాంచన 3’ వచ్చింది. ఇందులో ఏమైనా కొత్త కథ ఉంటుందేమోనని ఆశించిన ప్రేక్షకులతో పాటు లారెన్స్ అభిమానులూ నిరుత్సాహానికి గురయ్యారు. ఇందులోనూ అదే కథ! దెయ్యాలంటే వణికిపోయే రాఘవను ఒక దెయ్యం ఆవహించడం.. అతని ఇంట్లోవాళ్లు.. అమ్మ, అన్న, వదినలను భయపెట్టడం.. విలన్లను చంపడం.

యాక్టర్లు కూడా వాళ్లే.. కోవై సరళ, శ్రీమాన్, దేవదర్శిని. ఈ విషయంలో కొనసాగింపుకు దెబ్బ తగలకుండా చూసుకుంటున్నాడు లారెన్స్. అందుకు అతన్ని అభినందించాల్సిందే.

ప్రేక్షకులకు బోర్ కొడుతుందేమో కానీ, ఈ కథ లారెన్స్‌కు బోర్ కొట్టడం లేదని అర్థమవుతోంది. ‘కాంచన 3’లో ఉన్న కొత్త విషయం ఏమంటే లారెన్స్ డబుల్ రోల్ చెయ్యడం. రాఘవ కేరెక్టర్‌తో పాటు కాళి అనే ఇంకో పాత్ర చేశాడు లారెన్స్.

నిజ జీవితంలో లారెన్స్ తరహాలోనే కాళి కూడా పరోపకారి. ఒక అనాథాశ్రమం నడుపుతుంటాడు. విలన్లు అతడ్ని చంపితే, అతను దెయ్యమై లారెన్స్‌ను ఆవహిస్తాడు. తర్వాతేం జరుగుతుందో మనకు తెలిసిందే. “నువ్వు మాస్ అయితే, నేను డబుల్ మాస్” అనే  కాళి డైలాగ్ ఒక్కటి మాత్రం లారెన్స్ అభిమానుల్ని అలరించినట్లు కనిపిస్తుంది.

అది తప్పితే మిగతా కథంతా సిరీస్‌లోని మునుపటి సినిమాల మాదిరిగానే ఉండటం విసుగెత్తించింది. సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. ఆ ముగ్గురూ రాఘవను ఆకట్టుకోవడానికి చేసే చేష్టలు నాసిరకంగా ఉండటం బాధాకరం. ఫ్రాంచైజీలో మూడు సినిమాల్ని అలరించేలా తీసిన లారెన్స్, నాలుగోసారి అలా చెయ్యలేకపోయాడు.

కాంచన 3: వామ్మో.. మళ్లీ అదే కథా!

కాంచన 3: వామ్మో.. మళ్లీ అదే కథా!| actioncutok.com

You may also like: