‘కాంచన 3’ వసూళ్లు: తెలంగాణలో బ్రేకీవెన్ గ్యారంటీ!


'కాంచన 3' వసూళ్లు: తెలంగాణలో బ్రేకీవెన్ గ్యారంటీ!

‘కాంచన 3’ వసూళ్లు: తెలంగాణలో బ్రేకీవెన్ గ్యారంటీ!

మాస్ పల్స్ తెలిసిన రాఘవ లారెన్స్ చెప్పిన కథనే కొద్ది మార్పులతో మళ్లీ మళ్లీ చెప్పి ప్రేక్షకుల నుంచి డబ్బు రాబడుతున్నాడు. ‘కాంచన 3’తో మరోసారి ఆ విషయం రుజువవుతోంది. అధికారిక సమాచారం ప్రకారం తొలి వారాంతంలో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 9.18 కోట్ల షేర్ ఆర్జించింది. ఈ ఏరియాల్లో ‘కాంచన 3’ విడుదలకు ముందు రూ. 16 కోట్ల విలువకు అమ్ముడుపోయింది. అంటే తొలి మూడు రోజుల్లో 57 శాతం వసూళ్లను రాబట్టేసిందన్న మాట.

తెలంగాణలో రూ. 3.05 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా రాయలసీమలో రూ. 2.05 కోట్లు రాబట్టింది. ఆంద్రా ఏరియాలో రూ. 4.08 కోట్ల షేర్‌ను ‘కాంచన 3’ ఆర్జించింది. తెలంగాణలో ఇప్పటికే 75 శాతం షేర్‌ను ఆ సినిమా సాధించేసింది. ఈ ఏరియాలో ప్రి రిలీజ్ బిజినెస్ విలువ రూ. 4 కోట్లు. రాయలసీమలో రూ. 3.60 విలువకు గాను సుమారు 57 శాతం వసూలైంది.

ఇక ఆంధ్రాలో రూ. 8.4 కోట్ల విలువకు 48.5 శాతాన్ని రాబట్టింది. అంటే మిగతా రెండు ప్రాంతాలతో పోలిస్తే ఈ ఏరియాలో బ్రేకీవెన్ అవడం డౌటే. ఏప్రిల్ 26న ‘అవెంజెర్స్: ఎండ్ గేం’ వస్తున్నందున ఈ లోపుగానే సాధ్యమైనంత వసూళ్లను రాబట్టుకోవాల్సి ఉంది.

‘కాంచన 3’ వసూళ్లు: తెలంగాణలో బ్రేకీవెన్ గ్యారంటీ! | actioncutok.com

You may also like: