‘కాంచన’ రీమేక్: హిజ్రా పాత్రలో అమితాబ్!


'కాంచన' రీమేక్: హిజ్రా పాత్రలో అమితాబ్!

‘కాంచన’ రీమేక్: హిజ్రా పాత్రలో అమితాబ్!

రాఘవ లారెన్స్ నటించి, దర్శకత్వం వహించగా ఘన విజయం సాధించిన ‘కాంచన’ (ముని 2) హిందీలో ‘లక్ష్మీ’గా రీమేక్ అవుతోంది. ‘కాంచన’లో లారెన్స్ చేసిన రాఘవ కేరెక్టర్‌ను ‘లక్ష్మీ’లో అక్షయ్ కుమార్ పోషిస్తున్నాడు. హీరోయిన్‌గా కియారా అద్వానీ నటిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఒరిజినల్‌లో ‘కాంచన’గా శరత్‌కుమార్ చేసిన హిజ్రా పాత్రను హిందీలో అమితాబ్ బచ్చన్ చేయనున్నాడు. అంటే ఆయన టైటిల్ రోల్ ‘లక్ష్మీ’గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఆయన ఆ పాత్ర పోషణ కోసం సంతకం చేసినట్లు తెలిసింది.

అమితాబ్ రాకతో ‘లక్ష్మీ’పై అంచనాలు మరింత పెరిగాయి. విలన్లు ‘లక్ష్మీ’ని చంపితే, ఆయన దెయ్యంగా మారి హీరోను ఆవహించి, విలన్లపై ప్రతీకారం తీర్చుకోవడం ప్రధానాంశం. ఒరిజినల్ స్టోరీ మనకు తెలిసిందే అయినా హిందీలో హీరో హీరోయిన్ల పాత్రల్లో మార్పులు చేశారు. పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో ఆద్యంతం ఆసక్తికరంగా మలచేందుకు లారెన్స్ కృషి చేస్తున్నాడు.

కాంచన’ రీమేక్: హిజ్రా పాత్రలో అమితాబ్! | actioncutok.com

You may also like: