లక్ష్మీరాయ్ కేరెక్టర్లో మహేశ్ హీరోయిన్!

లక్ష్మీరాయ్ కేరెక్టర్లో మహేశ్ హీరోయిన్!
రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ‘కాంచన’ (ముని 2) సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులనీ ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా బాలీవుడ్లో రీమేక్ కానున్న విషయం తెలిసిందే.
ఒరిజినల్లో లారెన్స్ చేసిన పాత్రను హిందీలో అక్షయ్ కుమార్ పోషించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం హీరోయిన్ లక్ష్మీరాయ్ కేరెక్టర్‌కు కియారా అద్వానీ ఎంపికైంది. ఇప్పటికే ఆమె ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.
ఇప్పటికే ‘గుడ్ న్యూస్’ సినిమాలో అక్షయ్, కియారా కలిసి నటిస్తున్నారు. అయితే అందులో అక్షయ్‌కు జోడీ కరీనా కపూర్ అయితే, కియారా జోడీ దిల్జీత్ దోసాంజ్. తొలిసారి ‘కాంచన’ రీమేక్‌లో అక్షయ్, కియారా జంటగా నటించబోతున్నారన్న మాట.
‘ఫగ్లీ’ సినిమాతో నాయికగా పరిచయమైన కియారా, తర్వాత హిందీలో ‘ఎం.ఎస్. ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’, తెలుగులో మహేశ్ సరసన ‘భరత్ అనే నేను’, రాంచరణ్ జోడీగా ‘వినయ విధేయ రామ’ సినిమాలు చేసింది. ఇప్పుడు హిందీలో ‘గుడ్ న్యూస్’ చేస్తోంది.
‘కాంచన’ ఒరిజినల్లో శరత్‌కుమార్ చేసిన హిజ్రా కేరెక్టర్ హైలైట్ అయింది. హిందీలో ఆ పాత్రను ఎవరు చేస్తారనేది ఆసక్తికరం. కాగా హిందీ రీమేక్‌ని కూడా రాఘవ లారెన్స్ డైరెక్ట్ చేయనున్నాడు.
లక్ష్మీరాయ్ కేరెక్టర్లో మహేశ్ హీరోయిన్! | actioncutok.com
You may also like: