చారిత్రక పాత్రలో కీర్తి!


చారిత్రక పాత్రలో కీర్తి!
Keerthy Suresh

చారిత్రక పాత్రలో కీర్తి!

తమిళ సాహిత్యంలో గొప్ప చారిత్రక నవలగా పేరుపొందిన ‘పొన్నియన్ సెల్వన్’ ఆధారంగా అదే పేరుతో దిగ్దర్శకుడు మణిరత్నం ఒక చిత్రాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. పొన్నియన్ స్లెవన్ అంటే మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకున్న రాజరాజ చోళుడు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్టును మణిరత్నం సిద్ధం చేశారని సమాచారం.

ఇందులో ప్రధాన పాత్రలు పోషించనున్నవాళ్లంటూ ఇటీవల కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. వాళ్లలో విక్రం, జయం రవి, కార్తీ, కీర్తి సురేశ్ నటించడం ఖాయమని తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, మోహన్‌బాబు పేర్లు సైతం వినిపిస్తున్నా ఇంకా ధ్రువీకరణ కాలేదు.

కాగా కీర్తి సురేశ్ ఈ సినిమాలో కీలకమైన చోల యువరాణి కుందవై పాత్రను చేయనున్నట్లు సమాచారం. అది సినిమాలో మెయిన్ హీరోయిన్ కేరెక్టర్ కింద లెక్క. ఆమె మహావీరుడైన చోళ రాజ్య సైన్యాధిపతి వల్లవరాయ వందియదేవ ప్రియురాలు. అంతకు మించి రాజరాజ చోళుని సోదరి. చోళ రాజ్యాన్ని విస్తరింపజేయాలనీ, రాజరాజ చోళున్ని చక్రవర్తిగా చూడాలనీ తపించే పాత్ర.

ఆ పాత్రకు కీర్తి న్యాయం చేస్తుందని మణిరత్నం భావించడానికి కారణం తెలుగులో ఆమె చేసిన ‘మహానటి’ సినిమాయేనని అంతర్గత వర్గాల సమాచారం. ఆ సినిమాలో సావిత్రిగా కీర్తి ప్రదర్శించిన హావభావాలు మణిరత్నంను బాగా ఆకట్టుకున్నాయనీ, కుందవై పాత్రకు ఆమె సరిగ్గా సరిపోతుందని ఆయన భావించాడనీ, అందుకే ఆమెను తీసుకున్నాడనీ ఆ వర్గాలు తెలిపాయి.

ఆ వర్గాల ప్రకారం వందియదేవుని పాత్రను జయం రవి లేదా కార్తీలలో ఒకరు చేయనున్నారు.

చారిత్రక పాత్రలో కీర్తి! | actioncutok.com

You may also like: