చిరంజీవి సరసన కీర్తి?

చిరంజీవి సరసన కీర్తి?
Keerthy Suresh

చిరంజీవి సరసన కీర్తి?

ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి ‘సైరా.. నరసింహారెడ్డి’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ పూర్తవగానే శివ కొరటాల డైరెక్షన్‌లో నటించేందుకు చిరంజీవి సిద్ధమవుతున్నారు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాటినీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

ఈ సినిమాలో చిరంజీవి జోడీగా ఇప్పటివరకు నయనతార లేదా అనుష్క నటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. తాజాగా ‘మహానటి’ కీర్తి సురేశ్ పేరు ప్రచారంలోకి వచ్చింది. తన కథలోని నాయిక పాత్రకు కీర్తి అయితే మరింత యాప్ట్‌గా ఉంటుందని దర్శకుడు కొరటాల భావిస్తున్నట్లు సమాచారం.

ఇందులో కీర్తి నటించడం నిజమైతే, మునుపటి సినిమా ‘ఖైదీ నంబర్ 150’లో తన వయసులో సగం వయసున్న కాజల్ అగర్వాల్‌తో నటించిన చిరంజీవి, ఇప్పుడు అంతకంటే చిన్నదైన కీర్తితో రొమాన్స్ చేస్తున్నట్లు అవుతుంది. చూద్దాం.. ఈ సినిమాలో కీర్తి నటించడం ఖరారవుతుందో, లేదో..

చిరంజీవి సరసన కీర్తి? | actioncutok.com

You may also like:

One thought on “చిరంజీవి సరసన కీర్తి?

Comments are closed.