కేజీఎఫ్ చాప్టర్ 2: రాకీ చనిపోతాడా?

కేజీఎఫ్ చాప్టర్ 2: రాకీ చనిపోతాడా?
యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందిస్తోన్న ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ షూటింగ్‌కు ముందే అమితమైన క్రేజ్ సొంతం చేసుకుంది. కన్నడ సినిమా ప్రమాణాల ప్రకారం చూస్తే ‘కేజీఎఫ్’ను చాలా భారీ బడ్జెట్‌తో తీసినట్లు లెక్క. ఆ సినిమా కన్నడంతో పాటు, తెలుగు, హిందీ భాషల్లోనూ సూపర్ హిట్ అవడంతో దాని సీక్వెల్‌ను మరింత భారీగా తీసేందుకు నిర్మాతలు రంగం సిద్ధం చేశారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం రూ. 150 కోట్లకు మించిన బడ్జెట్‌తో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ తయారవుతోంది. దేశవ్యాప్తంగా వచ్చిన క్రేజ్‌తో రాకీ కేరెక్టర్ కోసం యశ్ తన శరీరాన్ని మరింత దృఢతరం చేసుకోడానికి బాగా శ్రమించాడు. సినిమాలో రెండు భారీ ఎపిసోడ్స్‌ను డైరెక్టర్ ప్లాన్ చేశాడు. వాటిలో ఒకటి ఇంటర్వెల్‌కు ముందు వస్తే, ఇంకొకటి క్లైమాక్స్‌లో వస్తుంది.
చాప్టర్ 2 క్లైమాక్స్‌లో రాకీ చనిపోతాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా నడుస్తోంది. అయితే అధికారికంగా దీన్నెవరూ ఖండించలేదు, అలాగని ధ్రువీకరించలేదు. ఏదేమైనా చాప్టర్ 1తో పోలిస్తే చాప్టర్ 2లో యశ్ కేరెక్టర్ మరింత శక్తిమంతంగా ఉంటుందనీ, పర్ఫార్మెన్స్ పరంగా యశ్‌కు మరింత పేరు తెస్తుందనీ మాత్రం తెలుస్తోంది.
శ్రీనిధి శెట్టి నాయికగా నటిస్తోన్న ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ప్రేక్షకుల ముందుకు 2020 మేలో రానున్నది.
కేజీఎఫ్ చాప్టర్ 2: రాకీ చనిపోతాడా? | actioncutok.com
You may also like: