యశ్ తర్వాత తెలుగు హీరోనే!


యశ్ తర్వాత తెలుగు హీరోనే!
Prashant Neel

యశ్ తర్వాత తెలుగు హీరోనే!

యశ్ హీరోగా రూపొందించిన ‘కేజీఎఫ్’ సినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేవలం కన్నడ నాటే కాకుండా దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. దర్శకుడిగా ఇది అతనికి కేవలం రెండో సినిమా. అతడి డైరెక్షన్‌లో సినిమా చెయ్యాలని టాలీవుడ్, బాలీవుడ్ హీరోలు కూడా కోరుకుంటున్నారు. ఈ రెండు సినీ రంగాలకు చెందిన పేరుపొందిన నిర్మాణ సంస్థలు ప్రశాంత్‌తో సంప్రదింపులు జరిపాయి కూడా.

అయితే ప్రశాంత్ తన మూడో సినిమానీ యశ్‌తోటే తియ్యాలని ముందుగానే నిర్ణయించుకొని ‘కేజీఎఫ్’కు సీక్వెల్ అయిన ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ను మొదలుపెట్టాడు. ఇప్పటికే ఆ సినిమా సెట్స్‌పై ఉంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరిగితే అక్టోబర్ నాటికి సినిమా పూర్తవుతుంది. నవంబర్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిపి 2020 వేసవిలో సినిమాని విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.

దిల్ రాజుతో డీల్ కుదిరింది!

ఆ తర్వాతే తన మూడో సినిమాకి ప్రశాంత్ పనిచేసే అవకాశాలున్నాయి. ఆ మూడో సినిమా హీరో ఎవరనేదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. యశ్ తర్వాత ప్రశాంత్ డైరెక్ట్ చెయ్యబోయేది టాలీవుడ్ హీరోనే అని గట్టిగా వినిపిస్తోంది. అదే నిజమైతే ఆ హీరో ఎవరవుతారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో జోరుగా నడుస్తున్నాయి.

నిర్మాత దిల్ రాజుతో కలిసి పనిచెయ్యాలనేది ప్రశాంత్ నీల్ ఆలోచనగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే ఆ ఇద్దరి మధ్య చర్చలు జరిగాయనీ, ప్రశాంత్ చెప్పిన కథ రాజుకు నచ్చిందనీ, 2020లో ఆ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా మొదలవుతుందనీ అంతర్గత వర్గాల సమాచారం. మహేశ్ లేదా ప్రభాస్‌లో ఒకరు ప్రశాంత్ డైరెక్షన్‌లో చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

యశ్ తర్వాత తెలుగు హీరోనే! | actioncutok.com

You may also like: