లతా మంగేష్కర్ తొలి తెలుగు పాట!


లతా మంగేష్కర్ తొలి తెలుగు పాట!
Lata Mangeshkar

లతా మంగేష్కర్ తొలి తెలుగు పాట!

లతా మంగేష్కర్ తొలిసారి తెలుగులో పాడి 64 సంవత్సరాలైందంటే నమ్మక తప్పదు. సాధనా ఫిలిమ్స్ నిర్మించిన ‘సంతానం’ సినిమా కోసం ఆమె తెలుగులో తొలి పాటను ఆలపించారు. అది “నిదురపోరా తమ్ముడా..” అనే జోల పాట. అనిసెట్టి రాసిన ఈ పాటకు సుసర్ల దక్షిణామూర్తి సంగీత బాణీలు కట్టారు. చెన్నైలోని రేవతీ స్టూడియోలో 1955 జనవరి 4న లత పాడుతుండగా ఈ పాటను రికార్డ్ చేశారు.

అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు, సావిత్రి, జూనియర్ శ్రీరంజని, చలం, రేలంగి, అమరనాథ్, రమణారెడ్డి, మిక్కిలినేని వంటి ప్రసిద్ధ తారాగణం నటించిన ఈ చిత్రానికి సి.వి. రంగనాథ దాస్ దర్శకుడు. 1955 ఆగస్ట్ 5న ఈ సినిమా విడుదలైంది. లత పాడిన “నిదురపోరాతా తమ్ముడా..” పాట సూపర్ పాపులర్ అయ్యింది.

లతా మంగేష్కర్ తొలి తెలుగు పాట!

లతా మంగేష్కర్ తొలి తెలుగు పాట! | actioncutok.com

You may also like: