ప్రేయసికి నీరాజనం అర్పించిన ‘డియర్ కామ్రేడ్’!


ప్రేయసికి నీరాజనం అర్పించిన 'డియర్ కామ్రేడ్'!

ప్రేయసికి నీరాజనం అర్పించిన ‘డియర్ కామ్రేడ్’!

విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా నటిస్తోన్న ‘డియర్ కామ్రేడ్’ సినిమాలోని తొలి లిరికల్ వీడియో విడుదలైంది. జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు కూర్చగా, రెహమాన్ రాసిన సాహిత్యం అమితంగా ఆకట్టుకుంది. గౌతం భరద్వాజ్ గొంతులో ఆ పాట ఎంత మంద్రంగా ఉందంటే, పాట వింటున్నంత సేపూ ఒక అలౌకిక లోకంలోకి వెళ్లిపోతామన్న మాటే.

“నీ నీలి కన్నులోని ఆకాశమే/ తెల్లారి అల్లేసింది నన్నే.. నీ కాలి అందెల్లోని సంగీతమే సఖి/ నీవైపే లాగేస్తుంది నన్నే..” ప్రేయసికి ఇంతకంటే గొప్పగా నీరాజనం ఏ ప్రియుడు పలుకుతాడు! అంతేనా.. “ఎవరు చూడని ఈ అలజడిలో/ కుదురు మరిచిన నా ఎద సడిలో.. ఎదురు చూస్తూ ప్రతి వేకువలో/ నిదుర మరచిన రాతిరి ఒడిలో..” అంటూ ఆ మధుర గీతం సాగింది.

నిజంగా పాటను చాలా బాగా రాశాడు రెహమాన్. కొంత కాలంగా బీట్‌లో కొట్టుకుపోయిన తెలుగు పాట ఇటీవల మళ్లీ తన మూలాల్ని వెతుక్కొంటోంది. అందులో భాగమే ఈ పాట. ఈ పాట రావడానికి కారకుడైన చిత్ర దర్శకుడు భరత్ కమ్మను అభినందించాల్సిందే. దర్శకుడిగా తన తొలి చిత్రంతోటే తన అభిరుచి ఎలాంటిదో అతను తెలియజేశాడు.

మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుకంతా నిర్మిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ మే 31న విడుదలవుతోంది.

ప్రేయసికి నీరాజనం అర్పించిన ‘డియర్ కామ్రేడ్’! | actioncutok.com

You may also like:

4 thoughts on “ప్రేయసికి నీరాజనం అర్పించిన ‘డియర్ కామ్రేడ్’!

Comments are closed.