మే 1న ‘మహర్షి’ వేడుక


మే 1న 'మహర్షి' వేడుక

మే 1న ‘మహర్షి’ వేడుక

మహేశ్ కథానాయకుడిగా నటించిన ‘మహర్షి’ ప్రి రిలీజ్ ఫంక్షన్ మే 1న హైదరాబాద్ నక్లెస్ రోడ్లో ఉన్న పీపుల్స్ ప్లాజాలో జరగనున్నది. ఎక్కువమంది అభిమానులు వచ్చేందుకు వీలుగా శిల్పకళావేదిక వంటి ఇండోర్ ఆడిటోరియంలో కాకుండా ఔట్డోర్ స్టేడియంలో పెట్టాలని నిర్మాతలు భావించారు. మొదట ఎల్బీ స్టేడియంలో వేడుక జరపాలనుకున్నారు. కానీ అక్కడ ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల ఈవీఎంలను భద్రపరచినందున వీలుకాదని అధికారులు చెప్పేశారు.

దాంతో వేదికను పీపుల్స్ ప్లాజాకి మార్చారు. గతంలోనూ అక్కడ కొన్ని సినిమా వేడుకలు జరిగాయి. కానీ రామానాయుడు సినీ విలేజ్లో జరిగిన ఒక సినిమా వేడుకలో జరిగిన తొక్కిసలాట వల్ల ఒక యువకుడు మృతి చెందడంతో పబ్లిక్ ప్లేసుల్లో సినీ వేడుకలపై ఆంక్షలు విధించారు పోలీసులు.

అప్పట్నుంచీ ఇండోర్ ఆడిటోరియంలలోనే సినిమా వేడుకలు జరుపుతూ వస్తున్నారు. ఇప్పుడు ‘మహర్షి’ వేడుకను పీపుల్స్ ప్లాజాలో జరుపుకోడానికి అనుమతినిచ్చారు. ఈ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ వేడుకకు మహేశ్ మునుపటి సినిమాల దర్శకులందర్నీ అహ్వానించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ వేడుకలో పాల్గొనే అవకాశాలున్నాయని వినిపిస్తోంది.

సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్ తొలి చిత్రం ‘రాజకుమారుడు’ దర్శకుడు కె. రాఘవేంద్రరావు ముఖ్య అతిథులుగా ఈ వేడుకలో పాల్గొననున్నారు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయగా పూజా హెగ్డే నాయికగా నటించిన ‘మహర్షి’ మే 9న విడుదలవుతోంది.

మే 1న ‘మహర్షి’ వేడుక | actioncutok.com

You may also like: