‘మహర్షి’ టీజర్ చెబుతున్న విషయాలు!


'మహర్షి' టీజర్ చెబుతున్న విషయాలు!

‘మహర్షి’ టీజర్ చెబుతున్న విషయాలు!

మహేశ్ కథానాయకుడిగా నటిస్తోన్న 25వ చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాని దిల్ రాజు, చలసాని అశ్వనీదత్, పొట్లూరి వరప్రసాద్ కలిసి నిర్మిస్తున్నారు.

ఉగాది పర్వదినం సందర్భంగా విడుదల చేసిన టీజర్ సినిమాలో మహేశ్ పోషించిన రిషి పాత్ర తీరుతెన్నుల్ని వ్యక్తం చేసేలా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో టీజర్ ఆసక్తికరంగా, ఉన్నత ప్రమాణాలతో ఉంది.

టీజర్ ఆరంభంలో ఖరీదైన సూట్ వేసుకున్న రిషి ఒక బిల్డింగ్ కారిడార్‌లో నడుస్తూ ఉంటే వెనుక నుంచి చూపించారు. వేరే దేశంలోని ఆకాశ హర్మ్యాల మీదుగా ప్రాయాణించిన ఆరిజిన్ కంపెనీ హెలికాప్టర్ ల్యాండ్ అవగానే అందులోంచి రిషి కిందికి దిగాడు. కోటు మిడిల్ బటన్‌ను పెట్టుకుంటూ నడిచాడు రిషి.

“రిషికుమార్ సక్సెస్ స్టోరీ ఇక్కడితో ఆగిపోయినట్లేనా?” అని ఎవరో నేపథ్యంలోంచి ప్రశ్నించారు.

అందుకు జవాబుగా పోడియం మీది నుంచి మాట్లాడిన రిషి “సక్సెస్‌లో ఫుల్‌స్టాప్స్ ఉండవు. కామాస్ మాత్రమే ఉంటాయి. (స్వరం పెంచి) సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్. సక్సెస్ ఈజ్ ఎ జర్నీ” అని చెబుతాడు కసిగా.

ఆ తర్వాత చూపులకు యూనివర్సిటీ బిల్డింగ్ మాదిరిగా కనిపించే దాని కారిడార్లలో రిషి ఒక్కడే చాలా స్పీడుగా పరిగెత్తుతూ కనిపించాడు.

'మహర్షి' టీజర్ చెబుతున్న విషయాలు!

చూపులకు ముఖేష్ రిషిలా కనిపిస్తున్న (వెనుక నుంచి చూపించారు) అతనితో రిషి “నాకొక ప్రాబ్లెం ఉంది సార్. ఎవడైనా నువ్వు ఓడిపోతావంటే గెలిచి చూపించడం నాకలవాటు” అని చెప్తాడు. ఆ మాటల మధ్యలోనే ఏదో ఒక తోటలో దుండగుల్ని భయంకరంగా చావగొట్టాడు.

ఆ వెంటనే ఒక గుడి ముందు చుట్టూ జనం ఉండగా కొంతమంది రౌడీల్ని ఉతికి ఆరేశాడు.

1 నిమిషం 19 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో ఒక్క రిషి పాత్రను మాత్రమే మనకు చూపించారు. హీరోయిన్ పూజా హెగ్డేని కానీ, ఫ్రెండ్ కేరెక్టర్ చేసిన అల్లరి నరేశ్‌ను కానీ, మరే పాత్రను కానీ ఈ టీజర్‌లో పరిచయం చెయ్యలేదు.

రెండు చోట్ల రిషి చెప్పిన మాటలు అతని మనస్తత్వానికి అద్దం పడతాయి. విజయాన్ని అతను గమ్యంగా భావించడు. ఒక ప్రయాణంగా భావిస్తాడు. అంటే అతను ఒక విజయంతో ఆగిపోడనీ, ఒక దాని తర్వాత ఒకటిగా విజయాలు సాధించుకుంటూ పోయే మనిషనీ అర్థం అవుతుంది.

అలాగే అతడితో ఎవరైనా నువ్వు ఓడిపోతావంటే ఒప్పుకోడనీ, గెలిచి చూపిస్తాడనీ తెలుస్తోంది. కచ్చితంగా అతడికి అలాంటి పరిస్థితులు తటస్థిస్తాయనీ, అతను గెలిచి చూపిస్తాడనీ మనం అంచనా వేసుకోవచ్చు. ఒక సాధారణ యువకుడు అసాధారణ రీతిలో ఒక బిలియనీర్‌గా ఎలా ఎదిగాడో ఈ సినిమా చూపిస్తుందని ఊహించుకోవచ్చు. రిషి ఎలాంటి సక్సెస్‌లు సాధించాడనేది ఆసక్తికరం.

మే 9న ‘మహర్షి’ జనం మధ్యకు వస్తున్నాడు. అతడి సక్సెస్ జర్నీని ఆస్వాదించడమే తరువాయి.

'మహర్షి' టీజర్ చెబుతున్న విషయాలు!

‘మహర్షి’ టీజర్ చెబుతున్న విషయాలు! | actioncutok.com

You may also like: