30 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ మ‌హేశ్‌తో..!


30 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ మ‌హేశ్‌తో..!

30 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ మ‌హేశ్‌తో..!

30 ఏళ్ల త‌ర్వాత ఓ కాంబినేష‌న్ మ‌ళ్లీ వెండితెర‌పై సాక్షాత్క‌రించ‌బోతోంది. అదే లేడీ సూప‌ర్‌స్టార్ విజ‌య‌శాంతి, సూప‌ర్‌స్టార్  ప్రిన్స్ మ‌హేశ్ కాంబినేషన్. ‘ఎఫ్‌2’ సినిమాతో సంక్రాంతి బ‌రిలో నిలిచి దిల్‌ రాజుకు బ్లాక్‌బస్ట‌ర్ హిట్‌ని అందించాడు అనిల్ రావిపూడి. ఈ సినిమా త‌రువాత అత‌ని మార్కెట్ స్థాయి పెర‌గ‌డం, సినిమాలో ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని పండించిన తీరు న‌చ్చ‌డంతో మ‌హేశ్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని అనిల్ రావిపూడితో చేయ‌డానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశాడు.

అయితే బిగ్ స్టార్ తొలిసారి త‌న‌కు ఆఫ‌ర్ ఇవ్వ‌డంతో భారీ లెవెల్లో చిత్రాన్నితెర‌పైకి తీసుకురావాల‌ని కాస్టింగ్ ద‌గ్గ‌రి నుంచే భారీగా ప్లాన్ చేయ‌డం మొద‌లుపెట్టాడు అనిల్. అందులో భాగంగా ఓ కీల‌క పాత్ర కోసం విజ‌య‌శాంతిని సంప్రదించాడు. గ‌త కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా వుంటూ క్రియాశీల రాజ‌కీయాల్లో బిజీగా వున్న రాముల‌మ్మ యువ ద‌ర్శ‌కుడు చెప్పిన పాత్రకు ఓకే చెప్పేసింద‌ని, సినిమాలో ఆమె హీరో మ‌హేశ్‌కు త‌ల్లిగా క‌నిపించే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.

1989లో వ‌చ్చిన ‘కొడుకు దిద్దిన కాపురం’లో విజ‌య‌శాంతికి కొడుకుగా మహేశ్ ద్విపాత్రాభిన‌యం చేసిన విష‌యం తెలిసిందే. మ‌ళ్లీ 30 ఏళ్ల విరామం త‌రువాత మ‌హేశ్, విజ‌య‌శాంతి మ‌ళ్లీ అవే త‌ర‌హా పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతుండ‌టంతో సినిమాపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఆ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టే చిత్రాన్ని భారీ స్థాయిలో దిల్ రాజు  ప్లాన్ చేస్తున్నార‌ని, ఇందులో విజ‌య‌శాంతి పాత్ర‌ ప‌క్కా తెలంగాణ స్లాంగ్‌లో సాగుతుంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌.

30 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ మ‌హేశ్‌తో..! | actioncutok.com

You may also like: