‘దిమాక్ ఖరాబ్’ చేస్తున్న నభా నటేష్

‘దిమాక్ ఖరాబ్’ చేస్తున్న నభా నటేష్
రామ్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తోన్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ‘డబుల్ దిమాక్’ అనేది ఉప శీర్షిక. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బేనర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన సెట్లో “దిమాక్ ఖరాబ్..” అనే పాటను రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్, వందమంది డాన్సర్లపై చిత్రీకరిస్తున్నారు. కాసర్ల శ్యామ్ తెలంగాణ యాసలో రాసిన ఈ పాటకు శేఖర్ కొరియోగ్రఫీ సమకూరుస్తున్నారు.
రీసెంట్గా దిమాక్ ఖరాబ్ అంటూ తెలంగాణ యాసలో సాగే ఈ పాటకు సంబంధించి నిధి అగర్వాల్ లుక్కు చాలా మంచి స్పందనవ వవ్చింది. లెటెస్ట్‌గా నభా నటేశ్ ఫోటోలు విడుదలయ్యాయి. ఇందులో నభా నటేష్ సరికొత్త లుక్‌లో, రూరల్ స్టైల్లో ఆకట్టుకుంటుంది.
రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్, పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాంశు పాండే తదితరులు నటిస్తున్న ఏ చిత్రానికి ఫైట్స్: రియల్ సతీష్, సాహిత్యం: భాస్కరభట్ల, ఎడిటర్: జునైద్ సిద్ధికీ, ఆర్ట్: జానీ షేక్, సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, మ్యూజిక్: మణిశర్మ, నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


‘దిమాక్ ఖరాబ్’ చేస్తున్న నభా నటేష్ | actioncutok.com
You may also like: