నాగార్జున ఫ్యాన్ వైపు.. సమంత సైకిల్ సైడు!


నాగార్జున ఫ్యాన్ వైపు.. సమంత సైకిల్ సైడు!
Samantha and Nagarjuna

నాగార్జున ఫ్యాన్ వైపు.. సమంత సైకిల్ సైడు!

తెలుగు చిత్రసీమలోని పేరుపొందిన అక్కినేని కుటుంబంలో మామా కోడల్లు తలో పార్టీ వైపు నిలుస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకవైపు నాగార్జున వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి సన్నిహితంగా మెలుగుతున్నారు. ప్రత్యక్షంగా వైసీపీకి జై కొట్టకపోయినా ఆ మధ్య జగన్‌ను కలిసొచ్చారు నాగార్జున. తాను మర్యాద పూర్వకంగానే జగన్‌ను కలిశానని నాగార్జున చెప్పినప్పటికీ ఆయన మద్దతు వైసీపీకేననే ప్రచారం జరిగింది.

తాజాగా ఆయన కోడలు, చైతన్య భార్య సమంత సైకిల్ గుర్తుకే ఓటేయండని ఓటర్లకు పిలుపునివ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. రేపల్లె అసెబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ను గెలిపించాలనీ, సైకిల్ గుర్తుకే ఓటెయ్యాలనీ ఆమె కోరుతున్న వీడిలో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఇలా మామ ఒక పార్టీకీ, కోడలు ఇంకో పార్టీకీ మద్దతుగా నిలవడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

నాగార్జున ఫ్యాన్ వైపు.. సమంత సైకిల్ సైడు! | actioncutok.com

You may also like: