పవర్ స్టార్‌ను ఇరికించేసిన నాగబాబు!


పవర్ స్టార్‌ను ఇరికించేసిన నాగబాబు!

పవర్ స్టార్‌ను ఇరికించేసిన నాగబాబు!

అనాలోచితంగా చేసే ప‌నులు కొంత మంది జీవితాల్ని గంద‌ర‌గోళంలో ప‌డేస్తాయి. అత్య‌త్సాహం ప్ర‌ద‌ర్శించినా అది అదుపుత‌ప్పితే న‌వ్వుల‌పాలు కావాల్సి వ‌స్తుంది. త‌మ్ముడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ విష‌యంలోనూ నాగ‌బాబు ఇదే ప‌నిచేసిన‌ట్టు తెలుస్తోంది.

ఈ నెల 18న విడుద‌ల చేసిన తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాల్లో గంద‌ర‌గోళం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. దీంతో విద్యార్థులు అయోమ‌యానికి లోన‌వుతుంటే కొంత మంది విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. దీనిపై త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో నాగ‌బాబు స్పందించారు. ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ అయితే ఆత్మహ‌త్య‌లే శ‌ర‌ణ్యం కాద‌ని విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

అక్క‌డితో నాగ‌బాబు త‌న ప్ర‌సంగాన్ని ఆపితే బాగుండేది కానీ అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించి త‌న ప‌రివారం విద్యార్హ‌త‌ల్ని ఏక‌ర‌వు పెట్ట‌డంతో ఆయ‌న వ‌ల్ల ప‌వ‌న్ మెడ‌కు కొత్త వివాదం చుట్టుకునే అవ‌కాశం ఏర్ప‌డుతోంది. ప‌వ‌న్ ఐటీ డిగ్రీ హోల్డ‌ర్ అని చెప్ప‌డంతో దీనిపై పెద్ద చ‌ర్చ‌మొద‌లైంది.

“నేను ఎల్ ఎల్ బీ పూర్తి చేశాను. మ‌ద్రాసు బార్ కౌన్సిల్‌లో రిజిస్ట‌ర్ కూడా చేయించుకున్నాను. అన్న‌య్య చిరంజీవి డిగ్రీ పాస్ అయ్యారు. ఇద్ద‌రు చెల్లెళ్లలో ఒకరు ఎంబీబీఎస్ పూర్తి చేశారు. మ‌రో చెల్లి డిగ్రీ హోల్డ‌ర్‌. క‌ల్యాణ్‌బాబు ఇంట‌ర్మీడియ‌ట్ పూర్త‌య్యాక ఐటీ డిగ్రీ చేశాడు” అని చెప్పి ప‌ప్పులో కాలేశారు నాగ‌బాబు.

ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ తాను ఎస్.ఎస్.ఎల్.సి. (పదో తరగతి) మాత్రమే పాసయ్యానని తెలియజేస్తే, దానికి భిన్నంగా ప‌వ‌న్ ఇంటర్మీడియేట్ తర్వాత ఐటీ డిగ్రీ పూర్తి చేశాడంటూ నాగ‌బాబు చెప్ప‌డంతో ఆయ‌న‌కు తెలియ‌కుండానే తమ్ముడు ప‌వ‌న్‌ను ఇరికించాడ‌ని సోష‌ల్ మీడియాలో పెద్ద ర‌చ్చ మొద‌లైంది.

ఆయన కావాలని గొప్ప కోసం అలా చెప్పారా, లేక నిజంగానే తమ్ముడు ఏం చదివాడో కూడా ఆయనకు తెలీదా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మ‌రి దీనిపై  జ‌న‌సేనాని ఎలా స్పందిస్తారో చూడాలి.

పవర్ స్టార్‌ను ఇరికించేసిన నాగబాబు! | actioncutok.com

You may also like: