ఆమె విమర్శలపై నాగార్జున నోరు మెదుపుతారా?


ఆమె విమర్శలపై నాగార్జున నోరు మెదుపుతారా?
Nagarjuna

ఆమె విమర్శలపై నాగార్జున నోరు మెదుపుతారా?

“భూ ఆక్రమణలకు పాల్పడిన హీరో నాగార్జునపై చర్య తీసుకొనే సత్తా తెలంగాణా ప్రభుత్వానికుందా?” అని ప్రశ్నించారు రాజకీయవేత్తగా మారిన లేడీ అమితాబ్ విజయశాంతి. రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ని రద్దు చేసే ఆలోచనలో ఉన్నామని ఇటీవల తెలాంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని నాగార్జున విషయమేంటని కేసీఆర్‌ను విజయశాంతి ప్రశ్నించారు.

కొన్నేళ్ల క్రితం మాదాపూర్‌లో ‘ఎన్ కన్వెన్షన్’ అనే ఫంక్షన్ సెంటర్‌ను నిర్మించారు నాగార్జున. ఈ సందర్భంగా ఆయన కొంత ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఆరోపణలొచ్చాయి. తెలంగాణ ఏర్పడక ముందు ఆ ఆక్రమణల సంగతి చూస్తామని కేసీఆర్ ప్రకటించారు. కానీ రాష్ట్రం ఏర్పడి, ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఆ విషయాన్ని మర్చిపోయినట్లుగా  ప్రవర్తిస్తూ వచ్చారు.

నాగార్జున సైతం కేసీఆర్, కేటీఆర్‌లతో సన్నిహిత సంబంధాలు నెరపుతూ వస్తున్నారు. ఈ క్రమంలో తను ఆక్రమించుకున్న స్థలాన్ని నాగార్జున క్రమబద్దీకరించుకున్నారు. ఇప్పుడు ఈ అంశాన్ని విజయశాంతి లేవనెత్తడంతో ‘ఎన్ కన్వెన్షన్’ భూమి విషయం మరోసారి వార్తల్లోకి వచ్చింది. దీనిపై ఇప్పటి దాకా తెలాంగాణ ప్రభుత్వం నోరు మెదపలేదు. నాగార్జున సైతం సైలెంట్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన దేశంలోనే లేరు. ‘మన్మథుడు’ షూటింగ్ నిమిత్తం పోర్చుగల్‌లో ఉన్నారు.

సందర్భవశాత్తూ నాగార్జున, విజయశాంతి జంటగా ‘జానకి రాముడు’, ‘విజయ్’, ‘జైత్రయాత్ర’ చిత్రాలు చేశారు.

ఆమె విమర్శలపై నాగార్జున నోరు మెదుపుతారా? |actioncutok.com

You may also like: