‘జెంటిల్‌మేన్’ తర్వాత మరోసారి!


'జెంటిల్‌మేన్' తర్వాత మరోసారి!
Nivetha Thomas

‘జెంటిల్‌మేన్’ తర్వాత మరోసారి!

ఇటీవలే ‘118’లో తన అభినయంతో ప్రేక్షకుల హృదయాల్ని తడి చేసిన మలయాళం సుందరి నివేదా థామస్ తాజాగా ఒక క్రేజీ సినిమాలో నాయికగా ఎంపికైంది. నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రధారులుగా ఇంద్రగంటి మోహనకృష్ణ ఒక సినిమాని రూపొందించనున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో ఒక నాయికగా నివేదా ఎంపికైనట్లు సమాచారం. అయితే ఇంకా ఈ సినిమాకు ఆమె సంతకం చెయ్యలేదనీ, నేడో రేపో చెయ్యడం ఖాయమనీ అంతర్గత వర్గాలు తెలిపాయి.

ఇదివరకే ‘జెంటిల్‌మేన్’ సినిమాలో నాని సరసన నటించి మెప్పించిన నివేదా ఈ సినిమాలో మరోసారి అతనితో జోడీ కట్టనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ‘సమ్మోహనం’లో జంటగా అలరించిన సుధీర్, అదితిరావ్ హైదరి ఇందులోనూ జంటగా కనిపించనున్నారు.

దిల్ రాజు నిర్మించే ఈ సినిమాలో పోలీసాఫీసర్‌గా సుధీర్ నటిస్తుండగా, నెగటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్‌ను నాని పోషించనున్నాడు. నివేదా ప్రస్తుతం శ్రీవిష్ణుతో ‘బ్రోచేవారెవరురా’, నిఖిల్‌తో ‘శ్వాస’ సినిమాలు చేస్తోంది.

‘జెంటిల్‌మేన్’ తర్వాత మరోసారి! | actioncutok.com

You may also like: