సినిమా ఫ్లాపని డైరెక్టర్ తేల్చేశాడు!

సినిమా ఫ్లాపని డైరెక్టర్ తేల్చేశాడు!
కమెడియన్ సప్తగిరి హీరోగా మారి చేసిన తొలి సినిమా సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ 2016 డిసెంబర్లో విడుదలైంది. విమర్శకులు ఆ సినిమాకి తక్కువ రేటింగ్ ఇచ్చారు. దీనిపై అప్పట్లో సప్తగిరి చాలా బాధపడ్డాడు కూడా. ప్రేక్షకులు సినిమాని బాగా ఆదరించారనీ, కానీ సమీక్షకులు విమర్శించడం తనకు బాధ కలిగించిందనీ వాపోయాడు.
సుమారు రెండున్నరేళ్లు గడిచాయి. ఇప్పుడు ఆ సినిమా సరిగా ఆడలేదని దాని ఒరిజినల్ డైరెక్టర్ తేల్చి చెప్పేశాడు. ఆ సినిమా ఎందుకు ఆడలేదో కూడా ఆయన తెలిపాడు. తమిళంలో వచ్చిన ‘తిరుడాన్ పోలీస్’ సినిమాకు ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ రీమేక్. ఒరిజినల్‌ను కార్తీక్ రాజు రూపొందించగా, తెలుగు రీమేక్‌కు అరుణ్ పవార్ దర్శకత్వం వహించాడు.
ప్రస్తుతం కార్తీక్ రాజు తెలుగు, తమిళ భాషల్లో ఒక సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగులో ‘నిను వీడని నీడను నేనే’ పేరుతో రూపొందుతున్న ఆ సినిమాలో సందీప్ కిషన్ హీరో. సందీప్ స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమా గురించి ‘ది హిందూ’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ గురించి కామెంట్ చేశాడు కార్తీక్ రాజు.
“తమిళ కథని చాలా భావోద్వేగపూరితంగా రాశాను. కానీ తెలుగులో చాలా మార్పులు చేశారు. అందుకే అది (సప్తగిరి ఎక్స్‌ప్రెస్) ఆడలేదు” అని అతను చెప్పాడు. అప్పట్లో తన సినిమాని విమర్శించిన వాళ్లపై అక్కసు వెలిబుచ్చిన సప్తగిరి, ఇప్పుడు స్వయంగా ఆ సినిమా ఒరిజినల్ డైరెక్టర్ చేసిన కామెంట్‌కు ఏమంటాడో!
సినిమా ఫ్లాపని డైరెక్టర్ తేల్చేశాడు! | actioncutok.com
You may also like: