క్విజ్: ‘సర్దార్ పాపారాయుడు’ సినిమా గురించి మీకెంతవరకు తెలుసు?

క్విజ్: 'సర్దార్ పాపారాయుడు' సినిమా గురించి మీకెంతవరకు తెలుసు?

క్విజ్: ‘సర్దార్ పాపారాయుడు’ సినిమా గురించి మీకెంతవరకు తెలుసు?

ఎన్టీఆర్ నట జీవితంలో గొప్పగా చెప్పుకొనే సినిమాల్లో ఒకటి ‘సర్దార్ పాపారాయుడు’. దాసరి నారాయణరావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ చేసిన ద్విపాత్రాభినయం ప్రేక్షకుల్ని అమితంగా అలరించింది.

ముఖ్యంగా పాపారాయుడు పాత్రలో ఎన్టీఆర్ నటన, ఆ పాత్రలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగులు చాలా కాలం ప్రజల మనసుల్లో నిలిచాయి. ఈ సినిమా డైలాగ్ క్యాసెట్లు రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయాయి. ఈ సినిమా చేసే నాటికి ఎన్టీఆర్ వయసు 57 సంవత్సరాలు.

1. పాపారాయుడు కొడుకుగా ఎన్టీఆర్ నటించిన పాత్ర పేరు

ఎ) రాము  బి) కృష్ణ  సి) గోపి

2. శ్రీ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ బేనర్‌పై ఈ చిత్రాన్ని తీసిన నిర్మాత

ఎ) టి. త్రివిక్రమరావు  బి) జి.వి.ఎస్. రాజు  సి) క్రాంతికుమార్

3. ఈ సినిమా కథా చర్చల్లో పాల్గొన్న సాహితీవేత్త

ఎ) శ్రీశ్రీ  బి) దాశరథి  సి) పాలగుమ్మి పద్మరాజు

క్విజ్: 'సర్దార్ పాపారాయుడు' సినిమా గురించి మీకెంతవరకు తెలుసు?

4. పాపారాయుడు భార్యగా నటించిన తార

ఎ) జయంతి  బి) శారద  సి) శ్రీవిద్య

5. ‘వినరా భారత వీరకుమారా’ బుర్రకథలో ఎన్టీఆర్ వేసే వేషం

ఎ) భగత్ సింగ్  బి) సుభాష్ చంద్రబోస్  సి) అల్లూరి సీతారామరాజు

6. బ్రిటిష్ అధికారిగా నటించి వెరైటీ డైలాగ్ డిక్షన్‌తో ఆకట్టుకున్న నటుడు

ఎ) మోహన్‌బాబు  బి) చలపతిరావు  సి) కె.వి. చలం

7. ‘హల్లో టెంపర్..’ పాటలో వచ్చే స్కూటర్ పేరు

ఎ) విజయ  బి) చేతక్  బి) వెస్పా

8. ‘జ్యోతిలక్ష్మి చీరకట్టింది..’ గీత రచయిత

ఎ) రాజశ్రీ  బి) వేటూరి  సి) దాసరి

9. సినిమా విడుదలైన 50 రోజుల తర్వాత చేర్చిన పాట

ఎ) తెల్ల చీర కళ్ల కాటుక  బి) జ్యోతిలక్ష్మి చీరకట్టింది  సి) ఉయ్యాలకు వయసొచ్చింది

10. ఈ సినిమా శత దినోత్సవానికి హాజరైన బాలీవుడ్ తార

ఎ) రేఖ  బి) హేమమాలిని  సి) వైజయంతీ మాల

క్విజ్: 'సర్దార్ పాపారాయుడు' సినిమా గురించి మీకెంతవరకు తెలుసు?

జవాబులు: 1. రాము  2. క్రాంతికుమార్  3. పాలగుమ్మి పద్మరాజు  4. శారద  5. అల్లూరి సీతారామరాజు  6. మోహన్‌బాబు  7. విజయ  8. దాసరి  9. జ్యోతిలక్ష్మి చీరకట్టింది  10. హేమమాలిని

క్విజ్: ‘సర్దార్ పాపారాయుడు’ సినిమా గురించి మీకెంతవరకు తెలుసు? | actioncutok.com

You may also like: