క్విజ్: ‘భైరవ ద్వీపం’ మీకెంతవరకు గుర్తుంది?

క్విజ్: 'భైరవ ద్వీపం' మీకెంతవరకు గుర్తుంది?

క్విజ్: ‘భైరవ ద్వీపం’ మీకెంతవరకు గుర్తుంది?

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన ‘భైరవ ద్వీపం’ చిత్రం విడుదలై ఏప్రిల్ 14తో పాతికేళ్లు పూర్తయ్యాయి. బాలకృష్ణ నటనా సామర్థ్యానికి గీటురాయిగా నిలిచిన చిత్రాల్లో విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రాన్ని చందమామ విజయా కంబైన్స్ సంస్థ నిర్మించింది. ఆ సినిమా మనకెంత వరకు గుర్తుందో తెలుసుకోవడానికే ఈ క్విజ్.

1. బాలకృష్ణ పోషించిన పాత్ర పేరు

ఎ) అజయ్  బి) విజయ్  సి) సంజయ్

2. సంభాషణల రచయిత

ఎ) రావి కొండలరావు  బి) పరుచూరి బ్రదర్స్  సి) గణేశ్ పాత్రో

3. బ్రహ్మానంద భూపతి పాత్రధారి

ఎ) రావు గోపాలరావు  బి) సత్యనారాయణ  సి) కోట శ్రీనివాసరావు

4) బాలకృష్ణ స్నేహితుడిగా కనిపించిన నటుడు

ఎ) సుత్తివేలు  బి) బ్రహ్మానందం  సి) బాబూమోహన్

5. ఉన్నత స్థాయి కెమెరా పనితనం కనబర్చిన సినిమాటోగ్రాఫర్

ఎ) ఎస్. గోపాల్‌రెడ్డి  బి) కె.ఎస్. ప్రకాశ్  సి) కబీర్ లాల్

6. ‘ఘాటైన ప్రేమ ఘటన..’ గీత రచయిత

ఎ) సీతారామశాస్త్రి  బి) వేటూరి  సి) సి. నారాయణరెడ్డి

7. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ గాయకుడిగా నంది అవార్డు తెచ్చిన పాట

ఎ) శ్రీ తుంబర నారద  బి) ఎంత ఎంత వింత మోహమో  సి) ఘాటైన ప్రేమ ఘటన

8. ‘భైరవ ద్వీపం’ శత దినోత్సవం జరుపుకున్న కేంద్రాలు

ఎ) 18  బి) 23  సి) 28

9) కురూపి అయిన విజయ్‌ని మామూలు మనిషిని చేసి, అతడి కురూపితనాన్ని తను తీసుకున్న తల్లి పాత్రధారి

ఎ) అన్నపూర్ణ  బి) మనోరమ  సి) కె.ఆర్. విజయ

10) గిరిబాబు, శుభలేఖ సుధాకర్ పాత్రల పేర్లు

ఎ) తూర్పు, పడమర  బి) ఉత్తరం, దక్షిణం  సి) లంబు, జంబు

క్విజ్: 'భైరవ ద్వీపం' మీకెంతవరకు గుర్తుంది?

జవాబులు: 1. విజయ్  2. రావి కొండలరావు  3. సత్యనారాయణ  4. బాబూమోహన్  5. కబీర్ లాల్  6. సీతారామశాస్త్రి  7. శ్రీ తుంబర నారద  8. 28  9. కె.ఆర్. విజయ  10. ఉత్తరం, దక్షిణం

క్విజ్: ‘భైరవ ద్వీపం’ మీకెంతవరకు గుర్తుంది? | actioncutok.com

You may also like:

One thought on “క్విజ్: ‘భైరవ ద్వీపం’ మీకెంతవరకు గుర్తుంది?

Comments are closed.