క్లాసిక్ ఫిల్మ్ రీమేక్‌లో రాజ్‌కుమార్ రావ్


క్లాసిక్ ఫిల్మ్ రీమేక్‌లో రాజ్‌కుమార్ రావ్
Rajkumar Rao

క్లాసిక్ ఫిల్మ్ రీమేక్‌లో రాజ్‌కుమార్ రావ్

బాలీవుడ్‌లోని ప్రతిభావంతులైన నటుల్లో రాజ్‌కుమార్ రావ్ ఒకడు. ఒక దాని తర్వాత ఒకటిగా భిన్న తరహా పాత్రల్ని సునాయాసంగా చేస్తూ వస్తున్నాడు. 2018లో వచ్చిన అతని మునుపటి సినిమా ‘స్త్రీ’ విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకాదరణనూ పొందింది.

తాజా సమాచారం ప్రకారం గతంలో ధర్మేంద్ర పోషించిన ఒక పాత్రను రాజ్‌కుమార్ చెయ్యబోతున్నాడు. హృషీకేశ్ ముఖర్జీ రూపొందించిన క్లాసిక్ కామెడీ ఫిల్మ్ ‘చుప్‌కే చుప్‌కే’ (1975) రీమేక్ కాబోతోంది. అందులో ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ హీరోలుగా నటించారు.

ఆ సినిమాని ఇప్పుడు రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. డేవిడ్ ధావన్ డైరెక్ట్ చేసే ఈ సినిమాలో ధర్మేంద్ర చేసిన ప్రొఫెసర్ పరిమళ్ త్రిపాఠి అలియాస్ ప్యారేలాల్ పాత్రకు రాజ్‌కుమార్ రావ్‌ను ఎంచుకున్నారు. అమితాబ్ చేసిన సుకుమార్ సిన్హా రోల్‌ను ఎవరు చేస్తారనేది ఇంకా తేలలేదు. ఈ రీమేక్‌ను భూషణ్ కుమార్, లవ్ రంజన్ సంయుక్తంగా నిర్మించనున్నారు.

క్లాసిక్ ఫిల్మ్ రీమేక్‌లో రాజ్‌కుమార్ రావ్ | actioncutok.com

You may also like: