అఖిల్ సరసన సంచలన తార


అఖిల్ సరసన సంచలన తార

అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో ఒక సినిమా రూపొందబోతోంది. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బేనర్‌పై అల్లు అరవింద్ నిర్మించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఇందులో అఖిల్ జోడీగా తాజా సంచలన తార రష్మికా మండన్న కనిపించనున్నది. రష్మిక ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘డియర్ కామ్రేడ్’, నితిన్ సరసన ‘భీష్మ’ సినిమాలు చేస్తోంది.

మూడు సినిమాలు చేసినా విజయం రుచి ఎరుగని అఖిల్, ‘పరుగు’ తర్వాత విజయాలు కరువవడమే కాకుండా, అసలు లైంలైట్‌లోనే లేకుండా పోయిన భాస్కర్ కాంబినేషన్‌తో అల్లు అరవింద్ సినిమా ప్లాన్ చేయడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కమర్షియల్ విలువలున్న ఫ్యామిలీ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం.

రష్మిక ఇప్పటికే గీతా ఆర్ట్స్‌లో ‘గీత గోవిందం’ సినిమా చేసినప్పటికీ ప్రస్తుతం ఉన్న డిమాండ్ రీత్యా అఖిల్‌తో చేసే సినిమాకి అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.

అఖిల్ సరసన సంచలన తార | actioncutok.com

You may also like: