‘రా’ వసూళ్లు: 4 రోజుల్లో రూ. 25 కోట్లు!


'రా' వసూళ్లు: 4 రోజుల్లో రూ. 25 కోట్లు!

‘రా’ వసూళ్లు: 4 రోజుల్లో రూ. 25 కోట్లు!

జాన్ అబ్రహాం నటించిన ‘రోమియో అక్బర్ వాల్టర్’ (రా) గత శుక్రవారం విడుదలైంది. రాబీ గ్రేవాల్ ఆ సినిమాకి దర్శకుడు. 1971 ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో స్పై థ్రిల్లర్‌గా ‘రా’ రూపొందింది.

రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ అండర్‌కవర్‌గా పనిచేసిన ఒక ఇండియన్ ఏజెంట్ కథ ఈ సినిమా. జాన్ అభ్రహాంతో పాటు మౌనీ రాయ్, జాకీ ష్రాఫ్, సికందర్ ఖేర్ కీలక పాత్రలు పోషించారు.

బాక్సాఫీస్ వద్ద తొలి రోజు రూ. 6 కోట్లు వసూలు చేసిన ‘రా’, రెండో రోజు రూ. 7.7 కోట్లను, ఆదివారం రూ. 9 కోట్లను వసూలు చేసింది. అందరి దృష్టీ సోమవారంపై నిలవగా, ఆ పరీక్షను రూ. 3 కోట్ల వసూళ్లతో పాసైంది. వెరసి నాలుగు రోజుల్లో ‘రా’ రూ. 25.7 కోట్లను రాబట్టింది. ఇవి చెప్పుకోదగ్గ వసూళ్లుగా విశ్లేషకులు పేర్కొటుంటున్నారు.

‘రా’ వసూళ్లు: 4 రోజుల్లో రూ. 25 కోట్లు! | actioncutok.com

You may also like: