‘ఆర్ ఆర్ ఆర్’ అప్డేట్: జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ తప్పుకుంది!


'ఆర్ ఆర్ ఆర్' అప్డేట్: జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ తప్పుకుంది!
Daisy Edgar Jones

‘ఆర్ ఆర్ ఆర్’ అప్డేట్: జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ తప్పుకుంది!

అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల్లో రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న ‘ఆర్ ఆర్ ఆర్’కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మూడు రోజుల క్రితం ఎక్సర్‌సైజులు చేస్తూ రాంచరణ్ గాయపడటంతో ఆయనకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణకు తాత్కాలికంగా ఆటంకం కలగగా, ఇప్పుడు ఏకంగా ఒక హీరోయిన్ సినిమా నుంచి తప్పుకుంది.

ఆమె.. జూనియర్ ఎన్టీఆర్ జోడీగా ఎన్నికైన బ్రిటిష్ నటి డైసీ ఎడ్గార్ జోన్స్. ఈ విషయాన్ని శుక్రవారం రాత్రి సినిమా అధికారిక ట్విట్టర్ అకౌంట్ తెలిపింది. “అనివార్యమైన పరిస్థితుల కారణంగా మా సినిమాలో డైసీ ఎడ్గార్ జోన్స్ ఇక భాగం కాదు. ఆమెకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం” అని ఆ పేజీలో పేర్కొంది.

దాంతో ఇప్పుడు ఆమె స్థానంలో ఏ తార వస్తుందోననే ఆసక్తి అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఇంతకీ డైసీయే సినిమా నుంచి తప్పుకుందా, లేక నిర్మాణ సంస్థే ఆమెను తప్పించిందా?.. అనే విషయం వెల్లడి కాలేదు. ఇప్పటికే రాంచరణ్ జోడీగా నటిస్తున్న అలియా భట్‌తో పాటు డైసీ కూడా అహ్మదాబాద్ షెడ్యూల్లో పాల్గొంటున్నట్లు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో డైసీ తప్పుకోవడం చర్చనీయాంశమైంది.

కాగా ఈ ఎదురుదెబ్బలు తగిలినా గుజరాత్ షెడ్యూల్‌ను అనుకున్న సమయానికి పూర్తిచెయగలిగామని దర్శకుడు రాజమౌళి తెలిపారు. ఈ సందర్భంగా షూటింగ్‌కు సహకరించి ఆతిథ్యం ఇచ్చిన ధర్మజ్, సిద్ధాపూర్ గ్రామస్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మరో మూడు వారాల్లో పూణే షెడ్యూల్‌ను మొదలుపెట్టనున్నారు. అజయ్ దేవ్‌గణ్, సముద్రకని కీలక పాత్రధారులైన ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. డి.వి.వి. దానయ్య ఈ చిత్రాన్ని రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

‘ఆర్ ఆర్ ఆర్’ అప్డేట్: జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ తప్పుకుంది! | actioncutok.com

You may also like: