ఆర్ ఆర్ ఆర్: జూనియర్ ఎన్టీఆర్ జోడీ ఎవరు?

ఆర్ ఆర్ ఆర్: జూనియర్ ఎన్టీఆర్ జోడీ ఎవరు?
యస్.యస్. రాజమౌళి రూపొందిస్తోన్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో జూనియర్ ఎన్టీఅర్ జోడీగా ఎవరు నటించనున్నారనే విషయం సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. ఆయన సరసన నాయికగా తొలుత ఎంపికైన బ్రిటిష్ నటి డైసీ ఎడ్గార్ జోన్స్ తప్పుకున్న విషయం తెలిసిందే. కుటుంబ కారణాల రీత్యా ‘ఆ ఆర్ ఆర్’ వంటి అద్భుత సినిమాలో నటించలేకపోతున్నానని సోషల్ మీడియా ద్వారా ఆమె ప్రకటించింది.
ఈ పరిస్థితుల్లో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్కు అవాంతరాలు ఏర్పడ్డాయి. రాంచరణ్ జోడీగా నటిస్తున్న అలియా భట్ కాల్షీట్లు సైతం వృథా అయ్యాయని తెలుస్తోంది. అహ్మదాబాద్లో సన్నివేశాల చిత్రీకరణ తర్వాత యూనిట్ పూణేకు మారాల్సి ఉండగా, షూటింగ్ రద్దు చేసుకొని యూనిట్ హైదరాబాద్కు వచ్చేసింది.
ప్రస్తుతం షూటింగ్కు 3 వారాల విరామం ఇచ్చారు. ఈలోగా జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ను ఎంపిక చేసే పనిలో ఉన్నారు దర్శకుడు రాజమౌళి. కథానుసారం ఒక నాయిక పాత్రకు బ్రిటిష్ తార అవసరం కావడంతో డైసీని ఎంపిక చేశారు. ఆమె స్థానంలో మరో బ్రిటిష్ లేదా అమెరికన్ నటిని తీసుకుంటారా లేక భారతీయ నటినే ఆ పాత్రకు ఎంపిక చేస్తారా.. అనేది చూడాలి.
సోషల్ మీడియాలో శ్రద్ధా కపూర్, జాన్వీ కపూర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరిలో ఒకరు జూనియర్ ఎన్టీఆర్ జోడీగా నటించే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది.
ఆర్ ఆర్ ఆర్: జూనియర్ ఎన్టీఆర్ జోడీ ఎవరు? | actioncutok.com
You may also like: