ఆ హీరోయిన్ ఆరేళ్లు ఇక్కడే చదువుకుంది!


ఆ హీరోయిన్ ఆరేళ్లు ఇక్కడే చదువుకుంది!
Shraddha Srinath

ఆ హీరోయిన్ ఆరేళ్లు ఇక్కడే చదువుకుంది!

నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ సినిమాతో నాయికగా పరిచయమవుతున్న కన్నడ అమ్మాయి శ్రద్ధా శ్రీనాథ్ నిజానికి తొలిగా సంతకం చేసిన సినిమా ఇది కాదు. ‘జెర్సీ’ కంటే ముందే ఆమె రెండు తెలుగు సినిమాలకు సంతకం చేసింది.

“ఈ సినిమా కంటే ముందే రెండు సినిమాలకు సంతకం చేశాను. ఒకటి సురేశ్ ప్రొడక్షన్స్‌లో. దానికి ‘క్షణం’ ఫేం రవికాంత్ పేరెపు డైరెక్టర్. దానికి ఇంకా టైటిల్ పెట్టలేదు. ఇంకో సినిమా ఆది సాయికుమార్‌తో చేస్తోన్న ‘జోడి’. ఆ రెండింటికీ 2017లోనే సంతకం చేశాను. 2018ల్ అక్టోబర్‌లో ‘జెర్సీ’ ఆఫర్ వచ్చింది. కానీ ముందుగా అదే రిలీజవుతోంది” అని చెప్పింది శ్రద్ధ.

ఆమెకు తెలుగు కొంచెం వచ్చు. కారణం ఆరేళ్లు హైదరాబాద్‌లోనే చదువుకోవడం. ఆమె తండ్రి ఆర్మీ ఉద్యోగి కావటాన రెండేళ్లకోసారి బదిలీ అయ్యేవాళ్లు. అందులో భాగంగా ఇక్కడకు వచ్చారు.

“నేను సికిందరాబాద్‌లో 6 సంవత్సరాలు ఉన్నాను. సెవెన్త్ స్టాండర్డ్ నుంచి ట్వల్త్ స్టాండర్డ్ దాకా. తిరుమలగిరిలోని కేంద్రీయ విద్యాలయలో చదువుకున్నా. అక్కడ తెలుగు కాస్త నేర్చుకున్నా. ఇప్పుడు కూడా గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటా” అని తెలిపింది శ్రద్ధ.

ఆ హీరోయిన్ ఆరేళ్లు ఇక్కడే చదువుకుంది! \ actioncutok.com

You may also like:

One thought on “ఆ హీరోయిన్ ఆరేళ్లు ఇక్కడే చదువుకుంది!

Comments are closed.