దళపతి సినిమా క్రేజ్ మామూలుగా లేదు!


దళపతి సినిమా క్రేజ్ మామూలుగా లేదు!

దళపతి సినిమా క్రేజ్ మామూలుగా లేదు!

‘దళపతి’ అంటే సాధారణంగా మనకు మణిరత్నం డైరెక్షన్‌లో రజనీకాంత్ చేసిన సినిమా గుర్తుకొస్తుంది. కానీ ‘దళపతి’ అంటే తమిళ సినీ ప్రేమికులకు మాత్రం హీరో విజయ్! రజనీ తర్వాత మాస్‌లో అత్యంత ఫాలోయింగ్ ఉన్న తమిళ హీరోగా విజయ్ రాణిస్తున్నాడు. గతంలో తెలుగు ప్రేక్షకులు అంతగా అసక్తి చూపలేదు కానీ ‘తుపాకి’ సినిమా వచ్చిన తర్వాత మనవాళ్లు కూడా విజయ్ సినిమాలను కొద్దో గొప్పో చూస్తున్నారు.

కాగా విజయ్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్‌లో నటిస్తున్నాడు. హీరోగా విజయ్‌కు ఇది 63వ సినిమా. సెట్స్‌పై ఉన్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు. అయినా ప్రేక్షకుల్లో ఈ సినిమాపై వెల్లువెత్తుతున్న అంచనాలకు ఆకాశమే హద్దు. దానికి తగిన కారణమే ఉంది.

అట్లీ డైరెక్షన్‌లో విజయ్‌కు ఇది మూడో సినిమా. అది కూడా మూడేళ్లలో చేస్తోన్న మూడో సినిమా. వాళ్ల కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా ‘తెరి’, (2016) సూపర్ హిట్టయింది. తెలుగులో దీని రీమేక్‌లో రవితేజ నటించబోతున్నాడు. 2017లో వచ్చిన రెండో సినిమా ‘మెర్సాల్’ అయితే బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపింది.

ఈ సినిమాలో తొలిసారిగా విజయ్ త్రిపాత్రాభినయం చేశాడు. అందులోనూ తండ్రి, ఇద్దరు కొడుకుల పాత్రల్లో. ఈ సినిమా విజయ్ కెరీర్‌లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలవడమే కాకుండా, ఆ సమయానికి దక్షిణాదిలో టాప్ సిక్స్ గ్రాసర్స్‌లో చోటు పొందింది.

అలాంటి కాంబినేషన్లో ఇప్పుడు మూడో సినిమా వస్తోంది. విజయ్ జోడీగా నయనతార నటిస్తుండటం ఈ సినిమాకు మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. ఈ ఏడాది దసరా సీజన్‌లో ఈ సినిమాని విడుదల చేయడానికి నిర్మాత కల్పాతి ఎస్. అఘోరం సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు తెలుగు నిర్మాతలు ఈ సినిమా తెలుగు హక్కుల కోసం పోటీ పడుతున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దళపతి సినిమా క్రేజ్ మామూలుగా లేదు! | actioncutok.com

Trending now: