తెలుగునాట పూర్వ వైభవం కోసం ఆరాటం!


తెలుగునాట పూర్వ వైభవం కోసం ఆరాటం!

తెలుగునాట పూర్వ వైభవం కోసం ఆరాటం!

’24’ సినిమా తర్వాత తెలుగులో వచ్చిన సూర్య సినిమాలు ‘సింగం 3’, ‘గ్యాంగ్’ ఫ్లాపయ్యాయి. ఫలితంగా తెలుగునాట సూర్య మార్కెట్ విలువ కాస్త కిందికి దిగింది. నిజానికి రజనీకాంత్ తర్వాత తెలుగులో ఎక్కువ మార్కెట్ ఉన్న హీరో సూర్యనే. అతడు హీరోగా నటించిన తమిళ ఒరిజినల్‌తో పాటే తెలుగు డబ్బింగ్ వెర్షన్ సైతం విడుదలవడం పరిపాటిగా మారడానికి కారణం ఆ మార్కెట్టే. ‘గజిని’ (2005) సినిమా నుంచీ అతడికి ఇక్కడ మార్కెట్ ఏర్పడింది.

ఇప్పుడు ‘ఎన్‌జీకే’తో తెలుగునాట మార్కెట్‌కు పూర్వ వైభవం తీసుకు రావాలని సూర్య పట్టుదలగా ఉన్నాడు. సెల్వ రాఘవన్ డైరెక్ట్ చేసిన ‘ఎన్‌జీకే’ (నంద గోపాల కృష్ణ)లో అతడు యువ రాజకీయవేత్తగా కనిపించనున్నాడు. ఇది తెలుగు సినిమాలా కనిపించడానికి తెలుగు ప్రేక్షకుల్లో ఇమేజ్ ఉన్న ఇద్దరు హీరోయిన్లతో సూర్య జత కట్టాడు. ఆ ఇద్దరు.. సాయిపల్లవి, రకుల్‌ప్రీత్ సింగ్. అంతేకాదు.. విలన్‌గా జగపతిబాబు కనిపించనున్నాడు.

డైరెక్టర్ సెల్వ రాఘవన్ కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ‘7/జి, బృందావన కాలని’ నుంచి ‘శ్రీరాఘవ’ పేరుతో అతడు ఇక్కడివాళ్లకు చేరువయ్యాడు. వెంకటేశ్ హీరోగా అతడు చేసిన ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే’ సినిమాతో డైరెక్టర్‌గా మరింత పేరు సంపాధించుకున్నాడు.

ఇలా తెలుగువాళ్లకు బాగా తెలిసిన కాంబినేషన్‌తో వస్తున్న ‘ఎన్‌జీకే’ సూర్యకు తెలుగునాట పూర్వ వైభవం తీసుకొస్తుందేమో చూడాలి. ఈ సినిమా మే 31న విడుదల కానున్నది.

తెలుగునాట పూర్వ వైభవం కోసం ఆరాటం! | actioncutok.com

Trending now: