తూచ్.. ‘టైగర్ కేసీఆర్’ ఆంధ్రోళ్లకు వ్యతిరేకం కాదు!


తూచ్.. 'టైగర్ కేసీఆర్' ఆంధ్రోళ్లకు వ్యతిరేకం కాదు!

తూచ్.. ‘టైగర్ కేసీఆర్’ ఆంధ్రోళ్లకు వ్యతిరేకం కాదు!

ఇటీవలి కాలంలో తన మాటలకు పదే పదే వివరణలు ఇచ్చుకోవాల్సిన స్థితిలో పడుతున్నారు దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఒక మాట అనడం, దానిపై ఏదే వివాదం రేగడం, దాంతో వివరణ ఇచ్చుకోవడం.. ఇదీ వర్మ వరుస.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విషయంలో ఆయన చేసిన రచ్చతో పోలిస్తే, జనం దాన్ని ఆదరించిన తీరు చప్పగా తేలిపోయింది. ఎప్పటికప్పుడు విడుదలకు ముందు ఊదరగొట్టడం, తీరా విడుదలయ్యాక గాలిపోవడం వర్మకు అలవాటయ్యింది. తాజాగా ‘టైగర్ కేసీఆర్’ టైటిల్‌తో సినిమా తీస్తున్న ఆయన ఆంధ్రుల తాటతియ్యనీకి కేసీఆర్ వస్తున్నాడంటూ స్వయంగా భీకర గొంతుతో రెండు లైన్లు పాడి భయపెట్టిన సంగతి తెలిసిందే.

కేసీఆర్ పేరు చెడగొట్టడానికే ఆ సినిమా వస్తున్నదంటూ వివాదం రేకెత్తేసరికి “తూచ్.. ‘టైగర్ కేసీఆర్’ సినిమా ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకం కాదు” అని చెప్పారు.

ఇంకా ఆయన ఏమని వివరణ ఇచ్చుకున్నారంటే.. “తెలంగాణ ప్రజలకు బాధాకర పరిస్థితుల్ని కల్పించిన కొందరు ఆంధ్రా నాయకులకు ఈ సినిమా వ్యతిరేకం. కేసీఆర్ తెలుగు ప్రజలనందర్నీ ప్రేమిస్తారు. ఆయన పోరాటం తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఆ ఆంధ్రా నాయకులపైనే.”

అలా కేసీఆర్ తరపున తానే వకాల్తా పుచ్చుకొని వివరణ ఇచ్చిన వర్మ ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకి అయిన వైఎస్ రాజశేఖరరెడ్డిపై కేసీఆర్ పోరాటాన్ని కూడా చూపిస్తారా?.. అనేది చూడాలి.

తూచ్.. ‘టైగర్ కేసీఆర్’ ఆంధ్రోళ్లకు వ్యతిరేకం కాదు! | actioncutok.com

You may also like: