మరోసారి ఫేవరేట్ డైరెక్టర్‌తో మహేశ్!


మరోసారి ఫేవరేట్ డైరెక్టర్‌తో మహేశ్!

మరోసారి ఫేవరేట్ డైరెక్టర్‌తో మహేశ్!

మహేశ్, త్రివిక్రమ్ చివరిసారిగా ‘ఖలేజా’ (2010) సినిమా కోసం పనిచేశారు. ఆ తర్వాత మళ్లీ వాళ్లు కలిసి పని చెయ్యడం కుదరలేదు. ఇన్నాళ్ల తర్వాత వాళ్లు మళ్లీ కలిశారు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండగా మహేశ్ నటించారు. ఆ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తున్నట్లు సమాచారమేమీ లేదని ఆశ్చర్యపోతున్నారా!

ఇది సినిమా కోసం కాదు. ఒక వాణిజ్య ప్రకటన కోసం!. గతంలో ఆ ఇద్దరూ థమ్స్ అప్ యాడ్ కోసం పనిచేశారు. ఇప్పుడు మరోసారి ఒక యాడ్ నిమిత్తం ఆ ఇద్దరూ కలిశారు. హైదరాబాద్‌లో దీని షూటింగ్ జరుగుతోంది. త్రివిక్రమ్ తన అభిమాన దర్శకుడిగా మహేశ్ గతంలో ప్రకటించాడు. ఇప్పుడు మరోసారి అదే విషయం చెబుతూ ” బ్యాక్ విత్ మై ఫేవరేట్. లవ్ ది ఎక్స్‌పీరియెన్స్ ఆల్వేస్” అని తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు.

మే 9న విడుదల కానున్న తన చిత్రం ‘మహర్షి’ ప్రమోషన్ కోసం మహేశ్ సిద్ధమవుతుండగా, అల్లు అర్జున్‌తో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు త్రివిక్రమ్.

మరోసారి ఫేవరేట్ డైరెక్టర్‌తో మహేశ్!

మరోసారి ఫేవరేట్ డైరెక్టర్‌తో మహేశ్! | actioncutok.com

You may also like: