నిజం: ఠాగూర్ మధుకు అది కూడా తెలియదు!


నిజం: ఠాగూర్ మధుకు అది కూడా తెలియదు!

నిజం: ఠాగూర్ మధుకు అది కూడా తెలియదు!

“ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో నాలుగు సినిమాలు వచ్చిన ఫ్రాంచైజీ ఇదొక్కటే” అని ‘కాంచన 3’ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో స్టేట్‌మెంట్ ఇచ్చారు నిర్మాత ఠాగూర్ మధు. రాఘవ లారెన్స్ ‘కాంచన 3’ సినిమా గురించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ ఆయన తప్పులో గట్టిగా కాలేశారు.

‘కాంచన’ సిరీస్ కంటే ముందే బాలీవుడ్‌లో రెండు సినిమా ఫ్రాంచైజీల్లో నాలుగు సినిమాలు వచ్చేశాయి. ఆ సినిమాలు ‘రాజ్’, ‘గోల్‌మాల్’.

అజయ్ దేవగణ్ హీరోగా, రోహిత్ శెట్టి డైరెక్షన్‌లో ‘గోల్‌మాల్’ సిరీస్ వచ్చింది. అందులో నాలుగో సినిమా ‘గోల్‌మాల్ అగైన్’ 2017 అక్టోబర్‌లోనే వచ్చేసింది. ఇక మహేశ్ భట్, ముఖేశ్ భట్ సోదరులు నిర్మించిన ‘రాజ్’ సిరీస్‌లో నాలుగో సినిమా ‘రాజ్ రిబూట్’ 2016లోనే రావడం గమనార్హం.

నిజానికి వీటికంటే ముందే భారతీయ సినిమాల్లో సీక్వెల్‌కు ఆద్యం పోసిన నటుడు కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్. సీఐడీ 999 కేరెక్టర్‌లో ఆయన నాలుగు సినిమాల సిరీస్‌ను 1960, 70లలోనే చెయ్యడం విశేషం. ఇవన్నీ జేమ్స్‌బాండ్ తరహా సినిమాలు. ఈ సిరీస్‌లో తొలి సినిమా ‘జడర బలె’ని 1968లో చేసిన ఆయన నాలుగో సినిమా ‘ఆపరేషన్ డైమండ్ రాకెట్’ను 1978లో చేశారు.

అలాగే మలయాళంలో ఇప్పటికే నాలుగు సినిమాల ఫ్రాంజైజీలు రెండు వచ్చాయి. వాటిలో ఒకటి మమ్ముట్టి చేసిన ‘సీబీఐ’ ఫ్రాంచైజీ కాగా, మరొకటి మోహన్‌లాల్ చేసిన ‘మేజర్ మహదేవన్’ సిరీస్.

ఇలా ఏ రకంగా చూసినా మనదేశంలో నాలుగు సినిమాలు వచ్చిన సిరీస్‌లో ‘కాంచన’ మొదటిది కాదు. కన్నడ, మలయాళ సినిమాల సిరీస్‌లపై అవగాహన లేకపోవడాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ, ఈ మధ్య కాలంలోనే హిందీలో వచ్చిన ‘రాజ్’, ‘గోల్‌మాల్’ సిరీస్‌ల గురించి కూడా ఠాగూర్ మధుకు తెలియకపోవడం ఆశ్చర్యకరం.

నిజం: ఠాగూర్ మధుకు అది కూడా తెలియదు!
Raghava Lawrence and Tagore Madhu

నిజం: ఠాగూర్ మధుకు అది కూడా తెలియదు! | actioncutok.com

You may also like: