వైరల్: నానిని కామెంట్ చేసిన రౌడీ హీరో!

వైరల్: నానిని కామెంట్ చేసిన రౌడీ హీరో!
‘అర్జున్‌రెడ్డి’ సినిమా టాలీవుడ్లో సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు.ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. తరువాత నుంచి అదే క్రేజ్‌ని కొనసాగిస్తున్న ఈ హీరో తన యాటిట్యూడ్‌నే రౌడీ బ్రాండ్‌గా చేసి వార్తల్లో కెక్కాడు. ట్విట్టర్లో తన అభిమానులతో నిత్యం టచ్‌లో వుంటూ ఆసక్తికర పోస్ట్‌లతో ఆకట్టుకునే విజయ్ దేవరకొండ తాజాగా నానిపై పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ చిత్రం ఇటీవల విడుదలై అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో నాని అద్భుత నటనకు ముగ్ధులైన వారంతా ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే అందరికి భిన్నంగా క్రేజీ హీరో విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది.
తన మనసులో ఏది అనిపిస్తే దాన్ని మొహమాటం లేకుండా బయటపెట్టే విజయ్ దేవరకొండ అదే స్థాయిలో ‘జెర్సీ’ చిత్రంపై స్పందించడం ఆకట్టుకుంటోంది.
“జెర్సీ సినిమా చూస్తుంటే నానిపై ఎంతో ప్రేమ ఏర్పడింది. క్రికెటర్ అర్జున్ పాత్రలో నాని అందరిచేత క్లాప్స్ కొట్టించాడు. సినిమాలో ప్రతీ ఒక్కరూ లీనమయ్యేలా చేశాడు. హిట్టింగ్ బ్యాటింగ్‌తో ఉక్కిరి బిక్కిరి చేసేశాడు. గౌతమ్ తిన్ననూరి టాలెంటెడ్ అనడానికి ఈ సినిమా చాలు. ఓ గమనిక: నాని హైదరాబాద్ సన్‌రైజర్స్ టీమ్‌కి ఆడొచ్చు. స్ట్రైకింగ్ అదరగొట్టేశాడు” అని రౌడీ హీరో విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు.
ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి 15 వేలకు పైగా రీట్వీట్లు రాగా, 11 వేల మందికి పైగా లైక్ చేయడం విశేషం.
వైరల్: నానిని కామెంట్ చేసిన రౌడీ హీరో! | actioncutok.com
You may also like: