తెలుగు ‘గల్లీబాయ్’ రేసులో విజయ్ దేవరకొండ!


తెలుగు 'గల్లీబాయ్' రేసులో విజయ్ దేవరకొండ!

తెలుగు ‘గల్లీబాయ్’ రేసులో విజయ్ దేవరకొండ!

బాలీవుడ్ సెన్సేషన్ రణ్‌వీర్ సింగ్ నటించిన చిత్రం ‘గల్లీబాయ్’. బాలీవుడ్లో ఇటీవల విడుదలైన ఈ చిత్రం అక్కడ భారీ విజయాన్ని సాధించింది. దీంతో దక్షిణాది నిర్మాతల కన్ను ఈ సినిమాపై పడింది. తెలుగుల్ రీమేక్ హక్కుల్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని చాలా మంది నిర్మాతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులు మెగా క్యాంప్‌కే దక్కాయి. మెగా ప్రొడ్యూసర్, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ చిత్ర తెలుగు రీమేక్ హక్కుల్ని భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు తెలిసింది. దర్శకుడు, నటుడు ఫర్హాన్ అఖ్తర్ సోదరి, ‘జిందగీ నా మిలేగి దొబారా’ ఫేమ్ జోయా అఖ్తర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రీమేక్‌లో సాయితేజ్ (సాయిధరమ్ తేజ్) నటించే అవకాశం వుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

అయితే అతని కంటే విజయ్ దేవరకొండ అయితేనే రణ్‌వీర్ పోషించిన పాత్రకు సరిగ్గా సరిపోతాడని, ఇప్పటికే మెగా క్యాంప్‌లో ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ చిత్రాలతో వరుసగా రెండు విజయాల్ని సొంతం చేసుకున్నాడు కాబట్టి ‘గల్లీబాయ్’ రీమేక్‌కు విజయ్ దేవరకొండ అయితేనే బాగుంటుందనే టాక్ వినిపిస్తోంది. తెలుగు ‘గల్లీ బాయ్’ ఛాన్సును అల్లు అరవింద్ ఎవరికిస్తారో చూడాలి.

తెలుగు ‘గల్లీబాయ్’ రేసులో విజయ్ దేవరకొండ! | actioncutok.com

You may also like:

2 thoughts on “తెలుగు ‘గల్లీబాయ్’ రేసులో విజయ్ దేవరకొండ!

Comments are closed.