వినాయక్ తర్వాతి సినిమా ఎవరితో?


వినాయక్ తర్వాతి సినిమా ఎవరితో?
VV Vinayak

వినాయక్ తర్వాతి సినిమా ఎవరితో?

అతి స్వల్ప కాలంలోనే టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరిగా ఎదిగిన వి.వి. వినాయక్ ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు స్థితిని ఎదుర్కొంటున్నాడు. ఆయన మునుపటి సినిమా ‘ఇంటిలిజెంట్’ 2018 ఫిబ్రవరిలో విడుదలైంది. అంటే ఏడాది దాటిపోయింది. ఇప్పటికీ ఆయన తదుపరి సినిమా ఎవరితో, ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేని స్థితి.

తమిళ హిట్ ఫిల్మ్ ‘కత్తి’కి రీమేక్‌గా చిరంజీవితో ఆయన చేసిన ‘ఖైదీ నంబర్ 150’ (2017) సూపర్ హిట్టయింది. దాని తర్వాత సాయిధరం తేజ్‌తో ‘ఇంటిలిజెంట్’ తీశాడు వినాయక్. అది బాక్సాఫీస్ వద్ద దారుణంగా దెబ్బతినడమే కాకుండా, తీవ్ర విమర్శల పాలయ్యింది కూడా.

ఆ సినిమా వినాయక్ కెరీర్‌పై దుష్ప్రభావాన్ని చూపించిందని ఇప్పటి వరకూ ఆయనకు ఏ హీరో గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడాన్ని బట్టి అర్థమవుతోంది. వెంకటేశ్‌తో ఆయన సినిమా చేయబోతున్నాడంటూ ప్రచారం జరుగుతున్నా, అందులో ఎంత వాస్తవమున్నదనేది అనుమానం.

ఎందుకంటే వెంకటేశ్ ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత త్రినాథరావు నక్కిన డైరెక్షన్‌లో చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఒకవేళ వినాయక్‌తో చెయ్యాలంటే ఆ సినిమా తర్వాతే చెయ్యాలి. అంటే 2019లో వినాయక్‌తో వెంకటేశ్ చేసే అవకాశాలు బహు తక్కువ.

2002లో ‘ఆది’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీతో డైరెక్టర్‌గా పరిచయమయ్యాక ఇలాంటి స్థితిని ఇదివరకెన్నడూ వినాయక్ ఎదుర్కోలేదు. వీలైనంత త్వరలో ఆయనకు మళ్లీ మంచి రోజులొస్తాయని ఆశిద్దాం.

వినాయక్ తర్వాతి సినిమా ఎవరితో? | actioncutok.com

You may also like: