మమతకు షాకిచ్చి బీజేపీలో చేరారు!


మమతకు షాకిచ్చి బీజేపీలో చేరారు!

మమతకు షాకిచ్చి బీజేపీలో చేరారు!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు షాకిచ్చారు. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు 50కి పైగా కౌన్సిలర్లు మంగళవారం బీజేపీలో చేరారు. తృణమూల్ ఎమ్మెల్యేలు శుభ్రాంగ్షు రాయ్, తుషార్‌కాంతి భట్టాచార్య, సీపీఐ(ఎం) ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ రాయ్ తమ పార్టీలో చేరినట్లు బీజేపీ లీడర్ అనిల్ బలూని తెలిపారు.

లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ టీఎంసీ నుంచి శుభ్రాంగ్షు రాయ్‌ని మమత suspend చేశారు. కాగా రాయ్ తండ్రి ముకుల్ రాయ్ బీజేపీ నాయకుడు కావడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికలు 7 దశల్లో జరిగినట్లుగానే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ నాయకులు బీజేపీలో చేరడం కూడా 7 దశల్లో జరుగుతుందని ఆ పార్టీ పశ్చిమ బెంగాల్ ఇన్‌చార్జి కైలాశ్ విజయవర్గీయ వ్యాఖ్యానించారు.

లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ బలం 34 నుంచి 22 సీట్లకు పడిపోగా, బీజేపీ బలం 2 స్థానాల నుంచి ఏకంగా 18 స్థానాలకు పెరగడం గమనార్హం.

మమతకు షాకిచ్చి బీజేపీలో చేరారు! | actioncutok.com

More for you: