లోక్సభ ఎన్నికలు: ఆరో దశకు అంతా సిద్ధం

లోక్సభ ఎన్నికలు: ఆరో దశకు అంతా సిద్ధం
ఆదివారం జరగనున్న ఆరో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈ దశలో మొత్తం ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 59 లోకసభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 979 మంది పోటీపడుతున్నారు.
మొత్తం 10 కోట్ల 18 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుష ఓటర్లు 5 కోట్ల 43 లక్షలు, మహిళా ఓటర్లు 4కోట్ల 75 లక్షల మంది ఉన్నారు. హర్యానాలో 10, మధ్యప్రదేశ్లో 8, ఉత్తరప్రదేశ్లో 14, బిహార్లో 8, పశ్చిమబెంగాల్లో 8, ఝార్ఖండ్లో 4, దిల్లీలో 7 లోక్సభ నియోజకవర్గాలకు ఆదివారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభ మవుతుంది.
పోలింగ్ కోసం ఏ ర్పాటు చేసిన 1,13 ,167 కేంద్రాలకు ఎన్నికల అధికారులు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భధ్రతా ఏర్పాట్లు చేశారు.
లోక్సభ ఎన్నికలు: ఆరో దశకు అంతా సిద్ధం | actioncutok.com
Trending now: