మంటల్లో విమానం.. 41 మంది మృతి!


మంటల్లో విమానం.. 41 మంది మృతి!

మంటల్లో విమానం.. 41 మంది మృతి!

ప్రయాణీకులతో కూడిన ఒక రష్యన్ విమానం మాస్కోలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవడం కారణంగా మంటలు చెలరేగడంతో అగ్నికీలల్లో చిక్కుకొని 41 మంది మృతి చెందారనీ, వారిలో కనీసం ఇద్దరు పిల్లలున్నారనీ దర్యాప్తు బృందం వెల్లడించింది.

మాస్కోలోని షెర్మెత్యేవో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో సుఖోయ్ సూపర్‌జెట్ 100 విమానం ల్యాండవడం, దాని వెనుక భాగంలో మంటలు చెలరేగి, నల్లటి పొగ దట్టంగా కమ్ముకోవడం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో ఫుటేజ్‌లో దర్శనమిస్తోంది.

ఆ ఫుటేజ్‌లో విమానం ముందు భాగం నుంచి ప్రయాణీకులు హడావిడిగా దిగుతుండటం, వెనుక వైపు దట్టమైన పొగ మేఘాలు ఆకాశంలోకి వెళ్తుండటం స్పష్టంగా కనిపిస్తోంది.

ముర్‌మాన్స్క్ నగరానికి వెళ్తున్న వెళ్తున్న సమయంలో పైలెట్లు అత్యవసరంగా మాస్కోలో విమానాన్ని దించేశారనీ, ఆ సమయంలో విమానంలో సిబ్బంది సహా 78 మంది ఉన్నారనీ దర్యాప్తు బృందం తెలిపింది. వారిలో 37 మంది ప్రాణాలు దక్కించుకున్నట్లు ఆ బృందం వెల్లడించింది.

మంటల్లో విమానం.. 41 మంది మృతి! | actioncutok.com

Trending now: