‘చిత్రలహరి’ హీరోయిన్ చేతిలో ఐదు సినిమాలు!

‘చిత్రలహరి’ హీరోయిన్ చేతిలో ఐదు సినిమాలు!
సాయితేజ్ సరసన ‘చిత్రలహరి’లో నటించిన కల్యాణి ప్రియదర్శన్ చేతిలో ఇప్పుడు మూడు భాషల్లో ఐదు సినిమాలున్నాయి. స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తెలుగు సినిమా ‘హలో’తో నాయికగా పరిచయమైన కల్యాణి వరుసగా రెండు సినిమాలు తెలుగులో చేశాక ఇప్పుడు తమిళంతో పాటు మాతృభాష మలయాళంలోనూ తొలిసారిగా నటిస్తోంది.
పి.ఎస్. మిత్రన్ డైరెక్ట్ చేస్తోన్న ‘హీరో’తో తమిళ చిత్రరంగానికి పరిచయమవుతోంది కల్యాణి. ఇందులో శివ కార్తికేయన్ హీరో. దానితో పాటు మరో రెండు తమిళ చిత్రాలు కూడా ఆమె చేస్తోంది.
కాగా మలయాళ సినిమాకు ఆమెను పరిచయం చేస్తోంది స్వయంగా ఆమె తండ్రి ప్రియదర్శన్. పేరుపొందిన డైరెక్టర్ అయిన ప్రియదర్శన్ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాలు రూపొందించారు. ప్రస్తుతం ఆయన మల్యాళంలో ‘మరక్కర్: అరబికడలింటే సింహం’ అనే చారిత్రక సినిమాని రూపొందిస్తున్నారు.
మోహన్‌లాల్, సునీల్‌శెట్టి, అర్జున్, సుదీప్, మంజు వారియర్, సుహాసిని వంటి పేరుపొందిన నటులు పనిచేస్తోన్న ఈ సినిమాతో కల్యాణి మలయాళ రంగానికి నటిగా పరిచయమవుతోంది. ఇందులో మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ సరసన ఆమె నటిస్తున్నట్లు సమాచారం.
‘చిత్రలహరి’ హీరోయిన్ చేతిలో ఐదు సినిమాలు! | actioncutok.com
Trending now: