’96’ రీమేక్.. అప్పుడే సగం పూర్తి

’96’ రీమేక్.. అప్పుడే సగం పూర్తి
తమిళనాట క్లాసిక్‌గా నిలచిన ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ’96’. విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రల్లో నూతన దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా.. గత ఏడాది అక్టోబర్ 4న విడుదలై భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.
విజయ్ సేతుపతి పాత్రలో శర్వానంద్, త్రిష పాత్రలో సమంత నటిస్తున్న ఈ రీమేక్‌ని కూడా ఒరిజనల్ వెర్షన్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ రూపొందిస్తుండడంతో.. ఆరంభం నుంచే ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు నెటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పుచేర్పులతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
అంతేకాదు.. ఉగాది సందర్భంగా లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుందని తెలిసింది. మిగిలిన చిత్రాన్ని వైజాగ్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పిక్చరైజ్ చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది. శర్వా, సమంతపై వచ్చే కాంబినేషన్ సీన్లన్నీ ఈ షెడ్యూల్స్‌లోనే పూర్తి చేస్తారని సమాచారం.
అలాగే జూలై నెలాఖరు నాటికి సినిమాని పూర్తి చేసి.. సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరి.. తమిళ వెర్షన్ లాగే తెలుగు వెర్షన్ కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తుందా? లెట్స్ వెయిట్.
’96’ రీమేక్.. అప్పుడే సగం పూర్తి | actioncutok.com
More articles for you: