క్రైం: బాత్‌రూంలో స్నానం చేస్తుండగా…


క్రైం: బాత్‌రూంలో స్నానం చేస్తుండగా...

క్రైం: బాత్‌రూంలో స్నానం చేస్తుండగా…

హైదరాబాద్:  పుదుచ్చేరి లోని ఓ హోటల్ లో హైదరాబాద్ కు చెందిన యువతికి చేదు అనుభవం ఎదురైయింది. ఆమె స్నానం చేస్తుండగా ఒకడు సెల్ ఫోన్ లో షూట్ చేస్తూ దొరికిపోయాడు. హైదరాబాద్ లో ఇంజినీర్ అయినా ఆ యువతి తన డాక్టర్ మిత్రునితో కలసి సోమవారం పుదుచ్చేరి వెళ్ళింది. వారు ఒక హోటల్ లో బస చేశారు.

పగలంతా నగరాన్ని చుట్టేసిన వారు సాయంత్రానికి హోటల్ కు చేరుకున్నారు. ఆమె స్నానం చేస్తుండగా వెంటిలేటర్ నుంచి ఎవరో సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తున్నట్లు కనిపెట్టి బిగ్గరగా కేకలు వేసింది. దీనిపై హోటల్ వారికి, పోలీసులకు పిర్యాదు చేసింది. అక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఆ  హోటల్‌లో పనిచేస్తున్న రిసెప్షనిస్ట్‌ ప్రశాంత్‌ నిర్వాకంగా గుర్తించారు.

తనకే పాపం తెలియదని ప్రశాంత్‌  బుకాయించాడు. తన సెల్ ఫోన్ చెక్ చేసుకొమ్మని అన్నాడు. పోలీసుల  తనిఖీ లో  అలాంటి వీడియో కనిపించ లేదు. ఈ క్రమంలో సెల్ ఫోన్  నుంచి తొలగించిన వీడియోల్ని సాఫ్ట్‌వేర్‌తో పునరుద్ధరించడంతో (రిట్రీవ్‌) అతడి బండారం బయటపడింది. వెంటనే అతనిని అరెస్ట్‌ చేశారు.

క్రైం: బాత్‌రూంలో స్నానం చేస్తుండగా… | actioncutok.com

Trending now:

2 thoughts on “క్రైం: బాత్‌రూంలో స్నానం చేస్తుండగా…

Comments are closed.