Who Will Get Appreciation First? Mahesh Or Vamshi?


Who Will Get Appreciation First? Mahesh Or Vamshi?
Mahesh Babu

After release of the movie ‘Maharshi’, ‘Director Vamshi Paidipally will get lot of appreciation first’, said Mahesh Babu.

‘మహర్షి’ రిలీజయ్యాక మొదట పేరొచ్చేది వంశీకే!

మహేశ్ 25వ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకున్నాడు వంశీ పైడిపల్లి. ఆ అవకాశాన్ని అతను రెండు చేతులా సద్వినియోగం చేసుకున్నాడు. మహేశ్ మాటల్ని బట్టి ‘మహర్షి’ని ఆయన ఊహించిన దానికి మించి గొప్పగా తీశాడు. సినిమా విడుదలయ్యాక తనకంటే కూడా ముందు వంశీకే పేరొస్తుందని గట్టి నమ్మకంతో చెప్పాడు మహేశ్.

వంశీ డైరెక్షన్ గురించి మాట్లాడుతూ “హి హాజ్ అ లాట్ ఆఫ్ క్లారిటీ. నాకు కథ ఎలా చెప్పాడో అలాగే తీశాడు సినిమాని. తనకేం కావాలో చాలా క్లారిటీగా యాక్టర్స్‌కి కమ్యూనికేట్ చేసి, వాళ్ల దగ్గర్నుంచి తనకు కావాల్సిన నటనను రాబట్టుకుంటాడు. హి డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. రేపు సినిమా రిలీజయ్యాక ఫస్ట్ పేరొచ్చేది వంశీకే. అంత అసాధారణంగా తీశాడు” అని పొగడ్తల్లో ముంచెత్తాడు.

వంశీతో పాటు క్రెడిట్‌ను అతని రచయితల బృందానికీ ఇచ్చాడు మహేశ్. “అతని టీంకు కూడా మంచి పేరొస్తుంది. హరి-సాల్మన్ స్క్రిప్ట్ మీద అసాధారణంగా వర్క్ చేశారు. కథని రెండేళ్ల పాటు డెవలప్ చేశారు. నేను ఓకే చేసిన దగ్గర్నుంచి స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తూనే వచ్చారు. దాని వల్లే సూపర్బ్‌గా వచ్చింది” అని చెప్పాడు మహేశ్.

Who Will Get Appreciation First? Mahesh Or Vamshi? | actioncutok.com

Trending now: