‘ఆర్ ఎక్స్ 100’ డైరెక్టర్‌కి కోపమొచ్చింది!

‘ఆర్ ఎక్స్ 100’ డైరెక్టర్‌కి కోపమొచ్చింది!
‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్లో సంచలనం సృష్టించాడు అజయ్ భూపతి. వర్మ స్కూల్ నుంచి వచ్చిన ఈ దర్శకుడు రెగ్యులర్ లవ్‌స్టోరీలకు భిన్నంగా ఓ యథార్థ కథని తెరపైకి తీసుకొచ్చిన తీరు పలువురిని ఆకట్టుకుంది.
ఓ భగ్న ప్రేమికుడిని నమ్మించి మోసం చేసిన ఓ యువతి కథగా కొత్త యాంగిల్లో తెరకెక్కిన ‘ఆర్ ఎక్స్ 100’ ఫిల్మ్ దర్శకుడిగా అజయ్ భూనతికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అదే స్థాయిలో వరుస అఫర్లను అందించింది. అయితే అందులో ఏ ఆఫర్‌ని అజయ్ భూపతి ఓకే చేయలేదు.
మంచి కథ కుదిరితే దానికి తగ్గ హీరోని వెతుక్కుంటానని మొహమాటం లేకుండా చెప్పే ఈ దర్శకుడు తాజాగా నాగచైతన్య హీరోగా ఓ పవర్ఫుల్ పోలీస్స్టోరీని తెరకెక్కంచబోతున్నాడని, దానికి ‘మహాసముద్రం’ అనే టైటిల్‌ని కూడా ఫిక్స్ చేశాడనే వార్తలు చాలా రోజులుగా షికారు చేస్తున్నాయి.
అయితే ఈ వార్తలపై అజయ్ భూపతి అసహనం వ్యక్తం చేశాడు. “నా రెండవ సినిమా ఎప్పుడు, ఎవరితో తీయాలో నాకు తెలుసు. ప్లీజ్ స్టాప్ ద రూమర్స్” అంటూ మీడియాపై అసహనాన్నివ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది.
‘ఆర్ ఎక్స్ 100’ డైరెక్టర్‌కి కోపమొచ్చింది! | actioncutok.com
Trending now: