అఖిల్ 4.. ముహూర్తం ఫిక్సయ్యిందా?

అఖిల్ 4.. ముహూర్తం ఫిక్సయ్యిందా?
అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన మూడో తరం కథానాయకుడు అఖిల్. ఊహ తెలియని వయసులో ‘సిసింద్రీ’గా మురిపించినా.. అక్కినేని ఫ్యామిలీ ప్యాక్‌తో రూపొందిన ‘మనం’లో అతిథిగా అలరించినా.. కథానాయకుడిగా మాత్రం ఇప్పటివరకు సరైన విజయం అందుకోలేకపోయాడీ యంగ్ హీరో.
‘అఖిల్’, ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’.. ఇలా అఖిల్ హీరోగా నటించిన మూడు సినిమాలూ ఊరించి ఉసూరుమనిపించాయి. ఈ నేపథ్యంలో.. నాలుగో సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు అఖిల్. తన సోదరుడు నాగచైతన్యకి తొలి బ్లాక్‌బస్టర్ ‘100% లవ్’ని అందించిన అల్లు అరవింద్ అనుబంధ సంస్థలో ఈ చిత్రం చేస్తున్నాడు అఖిల్. బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహించనున్నాడు.
గోపీ సుందర్ సంగీతమందించనున్న ఈ చిత్రానికి సంబంధించి కథానాయిక ఎంపిక ఇంకా పూర్తవలేదు. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్.. మే 24న లాంఛనంగా ప్రారంభమవుతుందని సమాచారం. జూన్ నెలాఖరు లేదా జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి.. ఈ ఏడాది చివరలో ఈ సినిమాని రిలీజ్ చేసే దిశగా ప్రణాళిక జరుగుతోంది. మరి.. నాలుగో చిత్రంతోనైనా అఖిల్ సాలిడ్ హిట్ కొడతాడా?
అఖిల్ 4.. ముహూర్తం ఫిక్సయ్యిందా? | actioncutok.com
More for you: