ఐదేళ్లు.. 9 హిట్లు!


ఐదేళ్లు.. 9 హిట్లు!

ఐదేళ్లు.. 9 హిట్లు!

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్.. 2015 నుంచి ఇప్పటివరకూ తన సమకాలీన హీరోల్లో అత్యధిక హిట్లు సాధించిన హీరోగా నిలిచాడు. ఈ కాలంలో అతడు హీరోగా 13 సినిమాలు రాగా, వాటిలో ఏకంగా 9 సినిమాలు విజయం సాధించాయి. మరే బాలీవుడ్ హీరో కూడా అతని దరిదాపుల్లో లేకపోవడం గమనార్హం.

2015లో అక్షయ్ నటించిన 4 సినిమాలు విడుదలవగా, వాటిలో ‘బేబీ’ సినిమా ఒక్కటే ఘన విజయం సాధించింది. ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’, ‘బ్రదర్స్’, ‘సింగ్ ఈజ్ బ్లింగ్’ ఆశించిన రీతిలో ఆడలేదు.

2016లో మూడు సినిమాలు రాగా, మూడూ హిట్టయ్యాయి. అవి.. ‘ఎయిర్ లిఫ్ట్’, ‘హౌస్‌ఫుల్ 3’, ‘రుస్తోం’.

2017లో అతడు హీరోగా నటించిన రెండు సినిమాలు ‘జాలీ ఎల్ఎల్‌బి 2’, ‘టాయిలెట్: ఏక్ ప్రేంకథ’ మంచి విజయాలు సాధించాయి. ‘నాం షబానా’ సినిమా చేసినా అందులో అతడికి అతిథి పాత్ర లాంటిది.

2018లో అక్షయ్ చేసిన మూడు సినిమాల్లో ‘ప్యాడ్‌మేన్’, ‘2.0’ సినిమా హిట్టవగా, ‘గోల్డ్’ ఫ్లాపయింది.

ఇక ఈ ఏడాది ఇప్పటివరకు ‘కేసరి’ సినిమా ఒక్కటే ప్రేక్షకుల ముందుకు రాగా, దానికి వాళ్లు ఘన విజయం సాధించిపెట్టారు. ఏడాది ఆఖరులోగా మరో మూడు సినిమాలు.. ‘మిషన్ మంగళ్’, ‘హౌస్‌ఫుల్ 4’, ‘గుడ్ న్యూస్’ విడుదల కానున్నాయి. అవి వచ్చాక అక్షయ్ హిట్ సినిమాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ఐదేళ్లు.. 9 హిట్లు! | actioncutok.com