ఫ్లాప్ డైరెక్టర్‌తో ‘ఏబీసీడీ’ హీరో


ఫ్లాప్ డైరెక్టర్‌తో 'ఏబీసీడీ' హీరో
Allu Sirish

ఫ్లాప్ డైరెక్టర్‌తో ‘ఏబీసీడీ’ హీరో

కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చి ఆరేళ్ళు దాటినా ఇప్పటివరకు సాలిడ్ హిట్ కొట్టలేకపోయాడు అల్లు వారబ్బాయి శిరీష్. అన్న అల్లు అర్జున్ మాదిరిగా స్టార్ హీరో కావాలని కలలు కంటున్నా.. అందుకు వేదికగా నిలచే సరైన కథలను మాత్రం ఎంచుకోలేక నానా అవస్థలు పడుతున్నాడు  శిరీష్ .

ఒక్క ‘శ్రీరస్తు శుభమస్తు’ మినహా ‘గౌరవం’, ‘కొత్త జంట’, ‘ఒక్క క్షణం’, ‘ఏబీసీడీ’.. ఇలా అల్లు శిరీష్ నటించిన ఏ సినిమా కూడా ఆశించిన మేర విజయం సాధించలేదు.

ఈ నేపథ్యంలో.. మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట శిరీష్ . ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’తో ఫ్లాప్ డైరెక్టర్ అనిపించుకున్న ప్రేమ్ సాయి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని.. అలాగే ‘సవ్యసాచి’, ‘మిస్టర్ మజ్ను’తో ఫ్లాప్ హీరోయిన్ ఇమేజ్ పొందిన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుందని ఫిల్మ్ నగర్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి. మరి.. ఫ్లాప్ డైరెక్టర్, హీరోయిన్ తో అల్లు వారబ్బాయి చేస్తున్న ఈ ప్రయోగం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.

ఫ్లాప్ డైరెక్టర్‌తో ‘ఏబీసీడీ’ హీరో | actioncutok.com