పాలిటిక్స్: అమిత్ షా.. ఒక సాధారణ అతిథి!


పాట్నాకు వచ్చే అందరు అతిథుల్లాగే అమిత్ షా ఒక సాధారణ అతిథేనని, ఆయనకు అలాగే స్వాగతం చెబుతామని శత్రుఘ్న సిన్హా వ్యాఖ్యానించారు.

పాలిటిక్స్: అమిత్ షా.. ఒక సాధారణ అతిథి!
Shatrughan Sinha

పాలిటిక్స్: అమిత్ షా.. ఒక సాధారణ అతిథి!

పాట్నా(బీహార్):  బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా త్వరలో ఎన్నికల ప్రచారానికి పాట్నా రానున్నట్లు తెలిసిందని, ఇక్కడకు వచ్చే అతిథులందరిలాగానే ఆయనకూ స్వాగతం అంటూ ఇటీవల బీజేపీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ లో చేరి, పాట్నాసాహిబ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న శతృఘ్న సిన్హా వ్యాఖ్యానించారు. “ఆయన ఇక్కడ చాయ్ తాగి, పకోడీలను తిని ఆనందించవచ్చు, అవంటే ఆయనకే కాదు, ఆయన పార్టీ వారికీ ఎంతో ఇష్టం” అంటూ వ్యంగ్యోక్తి విసిరారు.

గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఇంటర్వ్యూలో.. పకోడీలు అమ్ముకుని అయినా బతకొచ్చని వ్యాఖ్యానించిన విషయాన్ని శతృఘ్నసిన్హా చేసిన ఈ వ్యాఖ్యలు గుర్తుచేస్తున్నాయి. 2015 లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి బీజేపీ నేర్చుకున్నది ఏమీ లేదని శతృఘ్న విమర్శించారు. 

తరచూ రాజకీయ కూటములు మారుస్తున్న నితీష్ కుమార్ డీఎన్‌ఏలో ఏదో లోపముందని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. “ఆ వ్యాఖ్యలకు ఎన్డీఏ మూల్యం చెల్లించుకుంది” అని వ్యాఖ్యానించారు. పదే పదే బీహారీలను అవమానిస్తున్న బీజేపీకి ప్రజలు ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెబుతారన్నారు.

పాలిటిక్స్: అమిత్ షా.. ఒక సాధారణ అతిథి! | actioncutok.com

Trending now: