ఆ ఘర్షణలకు అమిత్ షాయే కారకుడు!


ఆ ఘర్షణలకు అమిత్ షాయే కారకుడు!
Arvind Kejriwal

ఆ ఘర్షణలకు అమిత్ షాయే కారకుడు!

మోగ (పంజాబ్‌): పశ్చిమ బెంగాల్‌లో చెలరేగిన ఘర్షణలకు బీజేపీ  జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాయే కారణమని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ ధ్వజమెత్తారు. గురువారం పంజాబ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ మమతా బెనర్జీకి అండగా తామంతా ఉన్నామని, ఇంత పక్షపాతంగా  పనిచేస్తున్న ఎన్నికల సంఘాన్ని చరిత్రలో ఇపుడే  చూస్తున్నామని విమర్శించారు.

ఈసీ బహిరంగంగానే బీజేపీకి మద్దతునిస్తున్నట్లుగా కనిపిస్తోందని ఆరోపించారు. మోదీకి, అమిత్‌ షాకి ప్రజలు ఓటుతోనే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. అమిత్ షా కోల్ కతా రోడ్ షో లో ఘర్షణలు జరిగిన దృష్ట్యా పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ప్రచారాన్ని ఈసీ ఒక రోజు తగ్గించింది. 

అంటే శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగియాల్సిన ఎన్నికల ప్రచారాన్ని గురువారం సాయంత్రమే ముగించాల్సి వచ్చింది. ఈసీ నిర్ణయాన్ని నిరసిస్తూ మమతకు చంద్రబాబు, కేజ్రీవాల్, మాయావతి, స్టాలిన్ అండగా నిలిచారు.

ఆ ఘర్షణలకు అమిత్ షాయే కారకుడు! | actioncutok.com

More for you: