23 తర్వాత ఏమైనా జరగొచ్చు!


23 తర్వాత ఏమైనా జరగొచ్చు!
Yeddyurappa

23 తర్వాత ఏమైనా జరగొచ్చు!

బెంగళూరు : ఈ నెల 23 తర్వాత తాను ముఖ్యమంత్రి అవుతానని ఎక్కడా చెప్పలేదని, అయినా ఏదైనా సాధ్యమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప స్పష్టం చేశారు. మంగళవారం ఆయన కల్ బుర్గిలో విలేకరులతో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాలలో ఏదైనా సాధ్యమేనని, చేతనైతే  మీ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని కాం గ్రెస్‌, జేడీఎస్‌ నేతలకు యడ్యూరప్ప సవా ల్‌ విసిరారు.

ఈనెల మూడో వారం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అస్థిత్వంలో ఉండడం కష్టమని అభిప్రాయపడ్డారు.  కాంగ్రెస్ -జేడీఎస్‌ నాయకుల గొడవల వల్లే  ప్రభుత్వం కూలిపోనుందన్నారు. అప్పటిదాకా వేచి ఉంటామన్నారు. ముఖ్యమంత్రి కుమారస్వామి విశ్రాంతి కోసం రిసార్టుకు వెళ్ళలేదని, అసంతృప్తులను బుజ్జగించడానికి రిసార్టులో మకాం వేశారన్నారు.

కుందగోళ, చించోళి అసెంబ్లీ నియోజకవర్గాలకు త్వరలో జరగనున్న  ఉప ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తామని యడ్యూరప్ప  ధీమా వ్యక్తం చేశారు.

23 తర్వాత ఏమైనా జరగొచ్చు! | actioncutok.com

Trending now:

One thought on “23 తర్వాత ఏమైనా జరగొచ్చు!

Comments are closed.