అయోగ్య: ఫైనాన్స్ గొడవల వల్లే ఆగింది!
రూ. 4 కోట్ల మేర ఉన్న ఫైనాన్స్ గొడవలే ‘అయోగ్య’ విడుదల నిలిచిపోవడానికి కారణమని వినిపిస్తోంది.

అయోగ్య: ఫైనాన్స్ గొడవల వల్లే ఆగింది!
విశాల్ హీరోగా నూతన దర్శకుడు వెంకట్ మోహన్ రూపొందించిన ‘అయోగ్య’ సినిమా విడుదల ఆగడానికి ఫైనాన్స్ గొడవలే కారణమని తెలుస్తోంది. తెలుగు హిట్ ఫిల్మ్ ‘టెంపర్’కు తమిళ రీమేక్‌గా రూపొందిన ‘అయోగ్య’ సినిమా షెడ్యూల్ ప్రకారం నేడు విడుదల కావాల్సి ఉంది.
అయితే తాను ఎంత ప్రయత్నించినా విడుదల ఆగిందంటూ విశాల్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించడంతో కోలీవుడ్ వర్గాలతో పాటు టాలీవుడ్ వర్గాలు కూడా షాక్‌కు గురయ్యాయి. ఓవైపు ఆన్లైన్లో అడ్వాన్స్‌గా టికెట్లు కొన్న అభిమానులు, సినీప్రియులు అయోమయానికి గురయ్యారు.
ఉదయం 8 గంటల షోకు థియేటర్లకు వెళ్లిన అభిమానులు సినిమా విడుదల కాలేదని తెలిసి నిరుత్సాహానికి గురయ్యారు. వాళ్ల టికెట్ డబ్బులు వాపసు ఇచ్చేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా నిర్మాతలకూ, ఫైనాన్షియర్లకూ మధ్య ఉన్న రూ. 4 కోట్ల ఫైనాన్స్ గొడవే ‘అయోగ్య’ విడుదల ఆగడానికి కారణమని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈరోజు సాయంత్రం లోపల ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆలస్యంగానైనా సినిమా విడుదల కావచ్చనీ ఆ వర్గాలు అంటున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.
అయోగ్య: ఫైనాన్స్ గొడవల వల్లే ఆగింది! | actioncutok.com
Trending now: